AP Pension Rules: “ఏ నెల పింఛను ఆ నెలలోనే..!” ఏపీలో పెన్షన్ వివాదంపై స్పందించిన సజ్జల.. ఫుల్ క్లారిటీ

పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు కొందరు విష ప్రచారం ప్రారంభించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. ప్రజల్ల, వృద్దుల్లో....

AP Pension Rules: ఏ నెల పింఛను ఆ నెలలోనే..! ఏపీలో పెన్షన్ వివాదంపై స్పందించిన సజ్జల.. ఫుల్ క్లారిటీ
Sajjala Ramakrishna Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 01, 2021 | 7:11 PM

పింఛన్ల విషయంలో అన్యాయం జరుగుతున్నట్లు కొందరు విష ప్రచారం ప్రారంభించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు. ప్రజల్ల, వృద్దుల్లో అపోహలు పెంచడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ ఎలా ఉందో తీసుకుంటున్న వృద్ధులను అడిగితే తెలుస్తుందన్నారు. ఆనాడు వైఎస్సార్ పింఛన్ పెంచి ఆదుకుంటే…ఇప్పుడు వైఎస్ జగన్ వారికి ఆసరాగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ చెప్పాక 2019 ఎన్నికల్లో అదే విషయాన్ని చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు.  చంద్రబాబు దిగిన రోజు నుంచి ఓ వర్గం మీడియా ఉక్కిరి బిక్కిరి అయిపోతుందని పేర్కొన్నారు.  99 శాతం చేస్తే ఆ ఒక్కటీ ఎందుకు చేయలేదు అంటున్నారు…చేసింది తామే అన్నది వారు గుర్తుపెట్టుకోవాలన్నారు. టీడీపీ హయాంలో పింఛన్ ఏ రోజు వస్తుందో కూడా తెలిసేది కాదని.. ప్రజంట్ ఏ నెలది ఆ నెల ఇస్తున్న క్రెడిట్ తమదేనని సజ్జల పేర్కొన్నారు.  అర్హులకు ఇస్తూ అనర్హులకు ఏరివేయాలని ప్రయత్నం చేస్తున్నామని.. వేరే రాష్ట్రంలో ఉండి పింఛన్ పొందుతుంటే ఏరివేయాలని ఉధ్దేశ్యంతోనే ఏ నెలకు ఆ నెల తీసుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అందుకే ఎక్కుడున్నా 5వ తేదీలోపు వచ్చి పింఛన్ తీసుకోవాలని చెప్పినట్లు స్పష్టం చేశారు.  60 లక్షల మందికి నిర్విఘ్నంగా మొదటి తేదీన పింఛన్ వస్తోందని చెప్పారు. టీడీపీ హయాంలో కేవలం ఎలక్షన్స్ టైమ్‌లోనే ఫించన్ల సంఖ్యను పెంచారని.. తాము మాత్రం ఎన్నికలతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు రన్ చేస్తుంటే.. అభినందిచాల్సింది పోయి బండలు వేస్తున్నారని సజ్జల సీరియస్ అయ్యారు.  వైఎస్సార్ కూతురుగా షర్మిలమ్మకు ఆయన పేరుపై సమావేశాలు పెట్టె హక్కు లేదా..? అని సజ్జల ప్రశ్నించారు.  రోడ్లపై ఆందోళన అంటున్న పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఎక్కడో ఉంటూ ఇక్కడి రోడ్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం రోడ్లు వేసేందుకు సిద్దంగా ఉందని..వర్షాకాలం తగ్గితే వెంటనే రోడ్లు వేస్తామని సజ్జల చెప్పారు.

2024లో కుప్పం నియోజకవర్గం నుంచి వెసీపీ ఎమ్మెల్యే విజయం సాధించాలి…

2024లో కుప్పం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏ ఘన విజయం సాధించేలా పనిచేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ నేత దివంగత చంద్రమౌళి తనయుడు భరత్ జెయింట్ కిల్లర్ గా అసెంబ్లీలో అడుగుపెట్టాలని అన్నారు. చంద్రబాబుకు సర్పంచ్ ఎన్నికల నుంచే కుప్పంలో కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వ‌న్య‌కుల క్ష‌త్రియ‌ కమ్యూనిటీ రాష్ట్ర స్థాయి సమావేశానికి వ‌న్య‌కుల క్ష‌త్రియ‌ ఛైర్‌పర్సన్‌ శ్రీమతి కె.వ‌నిత శ్రీ‌ను అధ్యక్షత వహించారు. సమావేశంలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. కుప్పం టిడిపి కోటను బ్రధ్దలు కొట్టుకుని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఎంతగా ప్రజల హృదయాలలో చొచ్చుకుని పోయారనేందుకు సర్పంచ్ ఎన్నికలలో విజయమే తార్కాణంగా నిలుస్తుందని సజ్జల అన్నారు. సర్పంచ్ ఎన్నికల విజయాలను యువనేత భరత్ కొనసాగించాలని కోరారు.

భారతీయ సమాజంలో అసమానతలైనా… ఆర్ధికాభివృధ్ది అయినా…. సాంస్కృతిక అభివృధ్ది అయినా… కులాల ఆధారంగా జరుగుతాయనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. వెనకబడిన బిసి కులాలను ప్రోత్సహించాలనే సదుధ్దేశ్యంతో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిగారు బిసి కులాలకు సంబంధించి ఫెడరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. వైయస్ జగన్ గారు మరో అడుగు ముందుకు వేసి బిసి అధ్యయన కమిటిని నియమించి బిసి కులాల్లో వెనకబడిన కులాలను గుర్తించారని తెలిపారు. వాటికి గుర్తింపు ఇవ్వాలనే ఉధ్దేశ్యంతో బిసి డిక్లరేషన్ ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి కార్పోరేషన్లను ఏర్పాటుచేశారన్నారు. బిసి కులాల్లో కూడా మహిళలను అన్ని విధాలా అభివృద్దిపధంలోకి తీసుకురావాలనే వారికి పదవులలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియచేశారు. చంద్రబాబు బిసి కులాలను ఆదరణ పేరుతో వారిని వృత్తులకే పరిమితం చేస్తూ కత్తెర్లు, తాపీపనిముట్లు, ఇస్త్రిపెట్టెలు మాత్రమే ఇస్తూ అందులో కుంభకోణాలకు పాల్పడుతూ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినట్లే బిసికులాలకు కూడా వెన్నుపోటు పొడిచారన్నారు. బిసిలను కేవలం ఓటుబ్యాంకుగానే కాకుండా వారిని సమాజంలో ఉన్నతవర్గాలతో సమానంగా అభివృధ్దిలోకి తీసుకురావాలనే ధృఢసంకల్పంతో జగన్ ఉన్నారన్నారు. ఇటీవల ప్రతిపక్షాలు, పచ్చమీడియా కలసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు….కేంద్రం నుంచి నిధులు రాకూడదని దుష్టపన్నాగాలు పన్నుతూ ….ఆర్ధిక సంక్షోభం ….అని దుష్ప్రచారం సాగిస్తున్నాయని విమర్శించారు. తిరిగి వీళ్లే సంక్షేమ పథ‌కాలలో ప్రభుత్వం కోత విధిస్తున్నారంటూ అడ్డగోలు వాదన చేస్తున్నారని అన్నారు. అయితే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. శ్రీ వైయస్ జగన్ రాష్ట్రంలో పేదవర్గాలు, ముఖ్యంగా బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలలో పేదరికాన్ని పొగొట్టే లక్ష్యంతో పనిచేస్తుంటే టిడిపి, బిజేపి కలసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. వన్యకుల క్షత్రియులు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలా వన్యకుల క్షత్రియ కార్పోరేషన్ లో నియమితులైన నేతలు పనిచేయాలన్నారు.

Also Read: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి మరో ప్రసాదం.. సరికొత్తగా ‘ధన ప్రసాదం’

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే