Tirumala: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి మరో ప్రసాదం.. సరికొత్తగా ‘ధన ప్రసాదం’

తిరుమల తిరుపతి దేవస్థానం మరో వినూత్న నిర్ణయంతో భక్తుల ముందుకొచ్చింది. శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి...

Tirumala: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి మరో ప్రసాదం.. సరికొత్తగా 'ధన ప్రసాదం'
Tirumala Dhana Prasadam
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 01, 2021 | 6:02 PM

తిరుమల తిరుపతి దేవస్థానం మరో వినూత్న నిర్ణయంతో భక్తుల ముందుకొచ్చింది. శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి టీటీడీ భక్తులకు అందజేస్తోంది. భక్తులు హుండీలో కానుకలుగా వేసిన నాణేలను తిరిగి భక్తులకే శ్రీవారి ధన ప్రసాదంగా అందజేస్తోంది. శ్రీవారికి నిత్యం లభించే హుండీ ఆదాయంలో 10 నుంచి 20 లక్షల రూపాయలు వరకు భక్తులు చిల్లర నాణేలు రూపంలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. నూట పదహార్లు.. వెయ్యి నూట పదహార్ల రూపంలో నోట్లతోపాటు చిల్లర కూడా సమర్పించుకునేవారు ఎక్కువ. ఇలా లభించే చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీంతో టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో టీటీడీ సరికొత్త ఐడియాతో ముందకు వచ్చింది.  చిల్లర నాణేలను నోట్ల రూపంలో మార్చుకునేందుకు శ్రీవారి ‘ధన ప్రసాదం’ పేరిట తిరుమలలో సామాన్యులు బస చేసే అతిధి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో 100 రూపాయి నాణేలను ప్రత్యేక కవర్లలో భక్తులకు అందజేస్తుంది.  ప్రస్తుతం ఒక్క రూపాయి నాణేలను ధనప్రసాదంగా ఇస్తుండగా…రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేల ప్యాకెట్ లను కూడా టీటీడీ భక్తులకు అందుబాటులోకీ తేనున్నది.

భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా చెల్లిస్తుండడంతో.. వారు గదిని ఖాళీ చేసే సమయంలో క్యాష్ ఆన్ డిపాజిట్‌ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధంగా బుధవారం నుంచి ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధన ప్రసాదాన్ని తిరుమల కొండపై కౌంటర్లలో కూడా అమ్ముతున్నారు. కవర్లో కాయిన్స్ తో పాటు పసుపు, కుంకుమ కలిపి అమ్ముతారు. కవర్ లోపల వంద రూపాయి కాయిన్స్ ఉంటాయి.  వందరూపాయలు చెల్లించి ఆ ధనప్రసాదాన్ని తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదం కొనుక్కున్నట్టుగానే కాయిన్స్ ప్రసాదం తీసుకోవచ్చు.

Also Read: స్కూల్స్‌లో క్రేజీ సీన్స్.. విద్యార్థులపై పూల వర్షం కురిపించిన టీచర్లు

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు