Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్కూల్స్‌లో క్రేజీ సీన్స్.. విద్యార్థులపై పూల వర్షం కురిపించిన టీచర్లు

తెలంగాణలో బడి గంట మోగింది. 18 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత స్కూల్స్ తెరుచుకున్నాయి. ఏడాదిన్నరగా ఇంటికే పరిమితమైన పిల్లలు బడి బాట పట్టారు. బ్యాగులు...

Telangana: స్కూల్స్‌లో క్రేజీ సీన్స్.. విద్యార్థులపై పూల వర్షం కురిపించిన టీచర్లు
Telangana Schools Reopen
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 01, 2021 | 4:41 PM

ఇన్నాళ్ల పాటు మనం గురు పూజలే చూసి ఉంటాం. కానీ ఇప్పుడు విద్యార్ధి పూజోత్సవం కళ్లకు కడుతోంది. బేసిగ్గా స్టూడెంట్ టీచర్ రిలేషన్- చేపకూ నీటికీ ఉన్న సంబంధం. అలాంటి అనుబంధం ఇంత కాలం మిస్సయిన సందర్భం కావచ్చు.. నాగర్ కర్నూల్ జిల్లా- కొల్లాపూర్ మండలం- సోమశిల గ్రామంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. బ్యూటీ ఆఫ్ స్కూలింగ్ దర్శనమిచ్చింది. ఇన్నాళ్లకు విద్యార్ధులు స్కూలుకు రావడంతో ఆనందం పట్టలేక పోయిన ఉపాధ్యాయులు వారిపై పూల వర్షం కురించి పులకించిపోయారు. కోవిడ్ కారణంగా ఏడాదిన్నరగా మా పిల్లలకు దూరంగా ఉన్నామనీ. దీంతో వారిని చూడలేకపోయామే అన్న బాధ మాలో ఎంత కాలంగానో దాగి ఉందనీ.. ఇప్పుడు స్కూళ్లు తెరుచుకోవడంతో మా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయని అంటున్నారు టీచర్లు.

తెలంగాణలో బడి గంట మోగింది. 18 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత స్కూల్స్ తెరుచుకున్నాయి. ఏడాదిన్నరగా ఇంటికే పరిమితమైన పిల్లలు బడి బాట పట్టారు. బ్యాగులు భుజాన వేసుకుని స్కూళ్లకు వెళ్లారు. పాఠశాలల పునఃప్రారంభంతో స్కూళ్లన్నీ సందడిగా మారిపోయాయ్. స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా, రాజ్ భవన్ ప్రభుత్వ స్కూల్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సందర్శించారు. ప్రతి క్లాస్ రూమ్ తిరుగుతూ స్టూడెంట్స్ తో మాట్లాడారు. పిల్లలను ధైర్యంగా స్కూళ్లకు పంపిన తల్లిదండ్రులను అభినందించిన గవర్నర్… ఇక జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు. ఫస్ట్ డే, 40శాతం విద్యార్ధులు స్కూళ్లకు హాజరయ్యారని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న సబిత… ధైర్యంగా పిల్లల్ని స్కూళ్లకు పంపొచ్చని సూచించారు.

కరోనా భయం వెంటాడుతున్నా, పిల్లల భవిష్యత్ కోసమే స్కూళ్లకు పంపుతున్నామని పేరెంట్స్ అంటున్నారు. అయితే, స్కూల్లో ఉన్నంతసేపూ కంటికి రెప్పలా చూసుకుంటామంటున్నారు టీచర్స్. ఏదేమైనా, స్కూల్ కి వచ్చి చదువుకుంటే ఆ మజానే వేరు. స్కూల్ లోనే నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అకడమిక్ పాఠాలతోపాటు అనేక మంచి విషయాలను స్కూల్ వాతావరణంలో ఆటోమేటిక్ గా తెలుసుకునే అవకాశముంటుంది. ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవడం వల్ల నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే, స్కూల్ లేదా కాలేజీకి వెళ్తే చాలు, అదే అన్నీ మనకు నేర్పిస్తుందని అంటారు. మొత్తానికి, ఏడాదిన్నరగా ఆన్ లైన్ క్లాసులతో విసిగిపోయిన పిల్లల్లో స్కూల్ వాతావరణం కొత్త జోష్ నింపుతోంది.

Also Read: 5 కంటే ఎక్కువ కేసులు నమోదైతే స్కూల్ క్లోజ్.. వ్యాక్సిన్ వేయించుకోకపోతే అక్కడ నో ఎంట్రీ

ముళ్లపొదల్లో పసిబిడ్డ.. బావిలో మైనర్ బాలిక మృతదేహం.. శిశువుకు జన్మనిచ్చి ఆపై