Avocado Benefits: అందం కోసం అవకాడో..! ఈ 5 ముఖ సమస్యలకు చక్కటి పరిష్కారం..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 02, 2021 | 7:58 PM

Avocado Benefits: సహజ వస్తువులు ఎల్లప్పుడు చర్మానికి మేలు చేస్తాయి. ఈ రోజుల్లో హోమ్‌ రెమిడిస్‌ని చాలా మంది అవలంభిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి

Avocado Benefits: అందం కోసం అవకాడో..! ఈ 5 ముఖ సమస్యలకు చక్కటి పరిష్కారం..
Avocado Skin

Avocado Benefits: సహజ వస్తువులు ఎల్లప్పుడు చర్మానికి మేలు చేస్తాయి. ఈ రోజుల్లో హోమ్‌ రెమిడిస్‌ని చాలా మంది అవలంభిస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ మీరు డ్రై స్కిన్‌తో బాధపడుతుంటే ఆవకాడో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మ సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. ఒక్కసారి దాని ప్రయోజనాల గురంచి తెలుసుకుందాం.

1. చర్మాన్ని తేమ చేస్తుంది అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాదు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కావాలంటే అవకాడోను హోం రెమిడిస్‌లలో ఉపయోగించవచ్చు. ఇది కాకుండా అవకాడో నూనెను కూడా వాడితే మంచిది.

2. యాంటీ ఏజింగ్ ముఖంపై ముడతలను తగ్గించడానికి మీరు అవకాడోని ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌ని వదిలించడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని టైట్‌గా చేస్తుంది.

3. మొటిమలను తొలగిస్తుంది చాలా మంది మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీని కారణంగా చర్మం మంటగా అనిపిస్తుంది. మొటిమలను వదిలించుకోవడానికి అవకాడోను మెత్తగా చేసి అప్లై చేయాలి. ఇది కాకుండా మీరు అవకాడో కలిగిన క్రీమ్ లేదా నూనెను కూడా అప్లై చేయవచ్చు.

4. హానికరమైన సూర్య కిరణాల నుంచి రక్షిస్తుంది అవకాడో సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి పనిచేస్తుంది. UV కిరణాల కారణంగా ముఖంపై గీతలు, ముడతలు, వృద్ధాప్యం ఛాయలు కనిపిస్తాయి. వీటిని నివారించడానికి అవకాడో ఉత్పత్తులు చక్కగా పనిచేస్తాయి.

5. చర్మాన్ని మృదువుగా చేస్తుంది అవకాడోలో చర్మాన్ని రిపేర్ చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఉంటాయి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా, శుభ్రంగా ఉంచుతుంది. ఇది చర్మం చికాకు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Health Tips: చిన్న పిల్లల జుట్టు ఎందుకు తెల్లబడుతుంది..! నియంత్రించాలంటే ఏం చేయాలి..?

Atal Pension Yojana: ప్రతిరోజూ రూ. 7 జమ చేయండి.. ఆ తర్వాత ప్రతి నెల రూ.5000 తీసుకోండి.. మీ తర్వాత మీ జీవిత భాగస్వామికి కూడా..

Big News Big Debate: దేవుడిపై గోల.. పార్టీల లీల..! బండి సంజయ్‌ వ్యాఖ్యలపై అభిప్రాయం.. లైవ్ వీడియో.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu