Weight Loss Tips: పొటాషియం అధికంగా ఉండే ఆహారం తింటే సులువుగా బరువు తగ్గవచ్చు.. అవేంటంటే..?
Weight Loss Tips: అవిసె గింజలు - అవిసె గింజలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని పచ్చిగా తినవచ్చు లేదా ఇతర ఆహారాలలో
Updated on: Sep 03, 2021 | 7:34 PM

అవిసె గింజలు - అవిసె గింజలలో పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని పచ్చిగా తినవచ్చు లేదా ఇతర ఆహారాలలో కలుపుకొని తినవచ్చు. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

అవకాడో: అవకాడోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల కడుపునిండిన భావం కలిగి తొందరగా ఆకలివేయదు.

శనగలు - ఇది శాకాహారులకు బలమైన ఆహారం. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం ఇతర పదార్థాలతో కలిపి తినాలి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

తీపి బంగాళాదుంప - ఈ దుంపను ఉడికించి తినాలి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రాజ్మా - రాజ్మాలో పొటాషియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ రోజువారి డైట్‌లో చేర్చితే మంచి ఫలితాలను ఇస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.



