Covid 10-Kids: పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు.. మీ ఇంట్లో పిల్లలుంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Sep 04, 2021 | 7:13 AM

Covid 10-Kids: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు స్కూల్ విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో..

Covid 10-Kids: పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు.. మీ ఇంట్లో పిల్లలుంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..
Child Corona

Covid 10-Kids: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు స్కూల్ విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో.. పిల్లలను తరగతి గదికి పంపుతున్నారు. పిల్లలు తిరిగి పాఠశాలకు వెళ్లడానికి చాలా ఉత్సాహం చూపుతుండగా.. డెల్టా వేరియంట్, సాధారణ జలుబు, శ్వాసకోస ఇన్‌ఫెక్షన్లు వ్యాపించడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లిదండ్రులు ఈ 3 విషయాలను తప్పక గుర్తించుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు.

1. కరోనా వైరస్ సోకిందా? జలుబు అయ్యిందా? అని నిర్ధారించుకోవాలి.. ప్రస్తుతం అత్యంత గందరగోళంగా ఉన్న ప్రశ్న ఏంటంటే ఇది జలుబా? లేక కోవిడ్ -19?. ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. తక్కువ మోతాదులో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు, జీర్ణాశయాంతర సమస్యలతో సహా సాధారణ జలుబు వంటి లక్షణాలను కలిగి ఉన్న పిల్లలలో కోవిడ్ 19 ఉండవచ్చు. వ్యాధి సోకిన పిల్లల్లో లక్షణాలు కనిపించొచ్చు.. ఒక్కోసారి కనిపించకపోవచ్చు. అందుకే నిర్ధారణ టెస్ట్‌ చేయించాలి.

2. పిల్లలలో ప్రత్యేక లక్షణాలు.. కొవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ ఉన్న కొందరు పిల్లలు, టీనేజ్‌లో కనిపించే ఏకైక లక్షణం ‘‘కోవిడ్ కాలి’’ లేదా గీతలు లాంటి చర్మ గాయాలు. ముఖ్యంగా కాలి వేళ్ళ మీద ఉంటాయి. ఇది చాలా అరుదు. కోవిడ్ లక్షణాలు లేకపోవడం వల్ల పాజిటివ్ అని తేలే అవకాశాన్ని తోసిపుచ్చలేము.

3. ఎవరు?, ఎలా పరీక్షించాలి?.. పిల్లలకు స్వల్ప లక్షణాలు కనిపించినా టెస్ట్ చేయించడం ఉత్తమం. ఇమ్యునో కాంప్రమైజ్డ్, కరోనా సోకిన వృద్ధుడు ఉంటే.. ఆ ఇంటికి చెందిన పిల్లవాడు పాఠశాలకు వెళ్తున్నా, బయటకు ఆడుకున్నా, స్నేహితులతో కలిసినా.. వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. సరైన సమయంలో టెస్ట్ చేయడం ద్వారా సరైన సమయానికి చికిత్స అందించడం జరుగుతుంది. తద్వారా ప్రాణాపాయం తగ్గుతుంది.

4. చిన్నారులకు పాజిటివ్ అని తేలితే.. చిన్నారులకు ఒకవేళ కరోనా పాజిటివ్ అని తేలినట్లయితే.. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీరు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఇంట్లోని మిగతా వారికి కూడా టెస్ట్ చేయించుకోవాలి. పిల్లల్లో కరోనా నివారణకు మందులు ఇంకా లేనందున.. వారికి సరైన విశ్రాంతి ఇవ్వడం, హైడ్రేటెడ్‌గా ఉండటానికి జ్యూస్‌లు ఇస్తుండాలి. కరోనా సోకిన చిన్నారులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒకవేళ చిన్నారులు తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నట్లయితే.. వెంటనే వైద్య నిపుణులను ఆశ్రయించాలి. ఆకస్మిక శ్వాసలోపం, తీవ్రమైన ఛాతి నొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించండి. విధిగా మాస్క్ ధరించండి. టీకాలు వేయించుకోండి. సాధారణ జలుబు, ఫ్లూ వంటి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు పరిశుభ్రతను పాటించడం చాలా ముఖ్యం.

Also read:

Virat Kohli: నయా రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి ఆసియన్‌గా భారత క్రికెట్ టీమ్ సారథికి అరుదైన గుర్తింపు..

Thalaivi Movie: ఓటీటీలోకి కంగనా సినిమా.. తలైవి విడుదల ఎప్పుడంటే..

Skin Care: గర్భధారణ తరువాత చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu