Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care: గర్భధారణ తరువాత చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించండి..

Skin Care: ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. తల్లి అనే భావన చాలా ప్రత్యేకమైనది. కానీ తల్లి అయిన తర్వాత, అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా..

Skin Care: గర్భధారణ తరువాత చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించండి..
Pregnant
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 04, 2021 | 7:03 AM

Skin Care: ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. తల్లి అనే భావన చాలా ప్రత్యేకమైనది. కానీ తల్లి అయిన తర్వాత, అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జన్మనివ్వడం జీవితాన్ని మార్చే అనుభవం అయితే, గర్భదారణ సమయంలో మహిళలు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటారు. మహిళలకు ప్రసవానంతరం అకస్మాత్తుగా జట్టు రాలడం, హైపర్ సెన్సిటివ్ స్కిన్ సమస్యలు రావడం వంటివి జరుగుతాయి.

ప్రసవానంతరం చాలా మంది మహిళ్లలో మహిళలు చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మొటిమలు, నల్లటి వలయాలు, స్ట్రెచ్ మార్క్స్, పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి. అందుకనే చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా జరగడానికి డెలివరీ తర్వాత వారి శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులే కారణం. మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే వారిలోని హార్మోన్ స్థాయిలు బాగా పడిపోతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు పడిపోతాయి.

1. శుభ్రపరచడం, ఎక్స్‌ఫోలియేట్ చేయడం.. వినడానికి చాలా ఈజీ అయినా.. చర్మ సంరక్షణలో ఇది చాలా ముఖ్యమైన అంశం. రసాయన రహిత క్లేన్సర్‌ని ఉపయోగించి క్లీన్ చేయడం చర్మానికి చాలా అవసరం. అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇది అవసరం.

2. బాగా మాయిశ్చరైజ్ చేయండి.. మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి ఎప్పుడూ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అవసరం లేదు. మర్ధన చేసే నూనెలు వాడటం వల్ల మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. గర్భధారణ కారణంగా ఏర్పడే పిగ్మెంటేషన్, స్ట్రెచ్ మార్కులను తగ్గించడంలోనూ ఆయిల్ సహాయపడుతుంది. బాధ్యతలతో పోరాడుతున్న యువ తల్లులకు, ఈ నూనె చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

3. ఫేస్ ప్యాక్.. క్లీనింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్ చేయలేకపోయినట్లయితే.. ఫేస్ మాస్క్ వేసుకోవచ్చు. బ్లాక్ ప్యాక్ చర్మాన్ని అద్భుతంగా క్లీన్ చేస్తుంది. మూసుకుపోయిన శ్వేద రంద్రాలను క్లియర్ చేస్తుంది. అలాగే మృత చర్మ కణాలను తొలగిస్తుంది.

మీరు ఈ మూడు రకాలుగా మీ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, గర్భధారణ తర్వాత కూడా మీ చర్మం ఎల్లప్పుడూ మెరుస్తూ ఉంటుంది. స్ట్రెచ్ మార్కులు కూడా చాలా త్వరగా అదృశ్యమవుతాయి.

Also read:

Hair Care Tips: జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ 6 సహజ మార్గాలు ప్రయత్నించండి..