Hair Care Tips: జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ 6 సహజ మార్గాలు ప్రయత్నించండి..
Hair Care Tips: జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. మందుల నుండి హార్మోన్ల అసమతుల్యత వరకు, మీరు తీసుకునే ఆహారం, పని ఒత్తిడి, వివిధ కారణాల..
Hair Care Tips: జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. మందుల నుండి హార్మోన్ల అసమతుల్యత వరకు, మీరు తీసుకునే ఆహారం, పని ఒత్తిడి, వివిధ కారణాల వల్ల జట్టు దారుణంగా రాలిపోతుంటుంది. అయితే, జుట్టు సమస్యలను అధిగమించడానికి, జుట్టు వేగంగా పెరిగేలా చేయడానికి అనేక రకాల సహజ పద్ధతులను అవలంబించవచ్చు. మరి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఉల్లిపాయ రసం: ఇది జుట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం ఉపయోగించడానికి, ముందుగా ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి దాని రసాన్ని పిండాలి. లేదా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తరువాత దాన్ని తలకు 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. కాసేపటి తరువాత షాంపుతో తలను శుభ్రం చేసుకోవాలి.
కొబ్బరి పాలు: కొబ్బరి పాలు సహజంగా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. తాజా కొబ్బరి నుండి కొబ్బరి పాలను తీయాలి. అందులో సగం నిమ్మకాయను పిండాలి. 4 చుక్కల లావెండర్ నూనెను కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఆ తరువాత 4-5 గంటలు అలాగే ఉంచి, తర్వాత కడిగేయండి.
ఆపిల్ సైడర్ వెనిగర్: ఈ వెనిగర్ తలను శుభ్రపరుస్తుంది. జుట్టు పిహెచ్ బ్యాలెన్స్‌ని నిర్వహిస్తుంది. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. నీటిలో కాస్త వెనిగర్ కలిపి జట్టుకు అప్లై చేయాలి. అలా జుట్టును కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా జట్టు మెరిస్తుంది. జట్టు పెరగడానికి ఇది సరైన మార్గం.
ఎగ్ మాస్క్: గుడ్లలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కొత్త జుట్టు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇందులో సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియం, భాస్వరం, అయోడిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎగ్ ప్యాక్ కోసం.. ఒక గిన్నెలో ఒక గుడ్డులోని తెల్లసొనను వేరు చేసి, ఒక టీస్పూన్ ఆలివ్ నూనె, తేనె కలపండి. దీన్ని పేస్ట్ లా చేసి, మీ జుట్టు, తలకు అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
మెంతికూర: జుట్టు పెరుగుదల కోసం మెంతులను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. ఒక మెత్తని పేస్ట్ అయ్యే వరకు గ్రైండర్‌లో ఒక టేబుల్ స్పూన్ ఈ హెర్బ్, నీరు కలపండి. దానికి కొద్దిగా కొబ్బరి నూనె వేసి మీ జుట్టుకు అప్లై చేయాలి. అలా అరగంట పటు ఉండనివ్వాలి. ఆ తరువాత మంచినీటితో శుభ్రపరుచుకోవాలి.
గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మీ తలకు గ్రీన్ టీని అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచండి. చల్లటి నీటితో కడిగేయండి.
Also read:
Benefits of Amla: ఉసిరి వల్ల కలిగే 6 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. మీకోసం..