Hyderabad: పిస్టల్‌తో బెదిరింపులు.. ఒంటరిగా వచ్చేవారే టార్గెట్.. ఇది ఫ్రాంక్ కాదండోయో.. అచ్చు సినిమాలోలానే..
వాళ్లు పిల్లలు కాదు పిడుగులు.. పెద్దలనే బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎట్టకేలకు పోలీసుల నిఘాతో ముగ్గురు కేటుగాళ్ల బండారం బయటపడింది.
Three Minor Thieves Arrest: వాళ్లు పిల్లలు కాదు పిడుగులు.. పెద్దలనే బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎట్టకేలకు పోలీసుల నిఘాతో ముగ్గురు కేటుగాళ్ల బండారం బయటపడింది. ఈ ఘటన రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. డమ్మీ పిస్టల్ చూపించి మరీ భయపెట్టేవారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే.. పాదచారులు, ద్విచక్ర వాహనదారులను అడ్డుకుని.. వారి నుంచి మొబైల్ ఫోన్లు, నగదు దోచుకుంటున్న ముగ్గురు బాల నేరస్థులను మీర్‌పేట్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు డమ్మీ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని నందనవనంలో నివాసం ఉండే ఇద్దరు బాలురు చిన్నప్పటి నుంచే చోరీలకు అలవాటుపడ్డారు. గతంలో పలుమార్లు ఇళ్లలో చోరీలు చేసి పోలీసులకు చిక్కి జువెనైల్ హోమ్‌లో శిక్ష కూడా అనుభవించారు. అనంతరం బెయిల్‌పై వచ్చిన ఇద్దరు కేటుగాళ్లు, మళ్లీ అదే పని చేస్తున్నారు. ఇటీవల వారికి అదే బస్తీలో ఉండే మరో బాలుడు తోడయ్యాడు. వీళ్లంతా చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి, సులువుగా డబ్బు సంపాదించడానికి చోరీలను ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ డమ్మీ పిస్టల్‌ను సంపాదించారు. రాత్రి పొద్దుపోయాక కాలనీల్లో తిరుగుతూ రోడ్లపై ఒంటరిగా కనిపించే వారిని అటకాయించి డమ్మీ పిస్టల్‌తో బెదిరించి వారి నుంచి నగదు, మొబైల్ ఫోన్లు దోచుకుంటారు.
ఇటీవల మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ సంఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితులను గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని జువెనైల్ కోర్టు ఎదుట హాజరు పరిచామని ఇన్‌స్పెక్టర్ మద్ది మహేందర్‌రెడ్డి చెప్పారు.
Suspension: సీలింగ్ ల్యాండ్‌లో అనుమతులు.. టీఎస్ బీపాస్ నిబంధనలకు తూట్లు.. మున్సిపల్ కమీషనర్‌పై వేటు!