AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ కారులో వెళ్తుంటే.. హెల్మెట్​లేదని 54 చలాన్లు.. లెక్కల మాస్టార్ అసలు లెక్క తీయడంతో.. చివరికి

సాధారణంగా బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే.. జరిమానా విధిస్తారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో కారులో ప్రయాణిస్తున్నప్పుడు, సైకిల్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులు జరిమానాలు విధించిన సన్నివేశాలను చూశాం..

రోజూ కారులో వెళ్తుంటే.. హెల్మెట్​లేదని 54 చలాన్లు.. లెక్కల మాస్టార్ అసలు లెక్క తీయడంతో.. చివరికి
Traffic Restrictions
Shaik Madar Saheb
| Edited By: Basha Shek|

Updated on: Nov 05, 2022 | 6:26 PM

Share

సాధారణంగా బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే.. జరిమానా విధిస్తారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో కారులో ప్రయాణిస్తున్నప్పుడు, సైకిల్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులు జరిమానాలు విధించిన సన్నివేశాలను చూశాం.. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. అక్టోబరు 19న హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసుల నుంచి కనీసం 54 చలాన్‌లను.. ఓ పాఠశాల ఉపాధ్యాయుడు అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. గత నెల రోజులుగా తాను కారులో మాత్రమే.. ప్రయాణిస్తున్నానని.. నేనెందుకు జరిమానా చెల్లించాలంటూ అయోమయంలో పడ్డాడు. పోలీసుల నుంచి ఫోన్లు కూడా రావడంతో.. చివరకు తాను గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసిన పాఠశాల నుంచి.. బయోమెట్రిక్ వివరాలను పోలీసులకు సమర్పించాడు. వీటిని పరిశీలించిన చెన్నై పోలీసులు అతనిపై నమోదు చేసిన అన్ని కేసులను రద్దు చేశారు.

కొన్ని నెలల క్రితం జార్ఖండ్‌ నుంచి చెన్నైకి వలస వచ్చిన సంజయ్‌కుమార్‌.. బీసెంట్‌ నగర్‌లోని ఇంటి నుంచి గోపాలపురంలో పని చేసేందుకు కారులో వెళ్లేవాడు. ఇంతలో, అక్టోబర్ 19న ట్రాఫిక్ పోలీసుల నుంచి మెస్సెజ్ వచ్చింది. హెల్మెట్ ధరించనందుకు 54 చలాన్‌లు విధించినట్లు వివరాలను పంపారు. దీంతో సంజయ్ కుమార్ అవాక్కయ్యాడు. అంతేకాకుండా.. ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి పోలీసుల నుంచి అతనికి కాల్స్ కూడా వచ్చాయి. మోటారు వెహికల్ చట్టం ప్రకారం.. హెల్మెట్ ధరించనందుకు జరిమానా చెల్లించాలని సూచించారు. తరచూ ఫోన్ కాల్స్‌ వస్తుండటంతో విసిగిపోయానని.. స్కూల్‌లో తన పనిపై కూడా దృష్టి పెట్టలేకపోయానని సంజయ్ కుమార్ చెప్పారు. తనకు బైక్ కూడా లేదని, కారులో వస్తూ ఉండేవాడినని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టిఎన్ 07 డిఎ 9831 నంబర్ గల వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ధరించలేదని  చలానా విధించినట్లు పోలీసులు తెలిపారు. సర్వర్ లోపం వల్లే ఈ సమస్య వచ్చిందని.. ఇతర ఉల్లంఘనలకు బదులుగా హెల్మెట్ ధరించలేదని చలాన్‌లో తప్పుగా పేర్కొనవచ్చని పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. వాహనదారుడిపై అన్ని చలాన్లను రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఓ సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. సమస్యపై దర్యాప్తు జరుగుతోందని, ఇది సాంకేతిక లోపం కావచ్చునని చెప్పారు. కాగా.. కారు యజమానికి హెల్మెట్ ధరించలేదని 50కి పైగా చలాన్లు అందడం చెన్నైలో సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..