Sweeper: స్వీపర్‌కు రూ.16 కోట్లు చెల్లించాలంటూ బ్యాంక్ నుంచి నోటీసులు..ఆ తర్వాత
సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఓ స్వీపర్‌కు బ్యాంకు షాకిచ్చింది. వెయ్యి కాదు, రెండు వేలు కాదు ఏకంగా రూ.16 కోట్లు రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్‌లోని వడోదరలో శాంతిలాల్ అనే వ్యక్తి తన భార్య జాషిబీన్‌తో కలిసి ఉంటున్నాడు.
సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఓ స్వీపర్‌కు బ్యాంకు షాకిచ్చింది. వెయ్యి కాదు, రెండు వేలు కాదు ఏకంగా రూ.16 కోట్లు రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్‌లోని వడోదరలో శాంతిలాల్ అనే వ్యక్తి తన భార్య జాషిబీన్‌తో కలిసి ఉంటున్నాడు. స్వీపర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చి 4 లోపు రూ.16 కోట్లు చెల్లించాలంటూ అతని ఇంటికి నోటీసులు పంపించింది. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే చట్టం ప్రకారం వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని కూడా ఆ నోటీసులో తెలిపారు. వీటిని చూసిన శాంతిలాల్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతున్నారు. తన భార్యకు ఆ భయంతో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అసలు విచిత్రం ఏంటంటే ఆ నోటీసులు వచ్చిన బ్యాంకుకు సంబంధించి శాంతిలాల్‌కు అకౌంట్ కూడా లేదు. అయితే ఈ నోటీసులు తమ ఇంటికి ఎందుకు వచ్చాయో శాంతిలాల్ కుటుంబానికి అర్థం కాలేదు. దీని గురించి తెలుసుకునేందుకు వడోదర సిటీ ఆఫీస్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఉన్న అధికారులు కూడా ఇలా ఎందుకు వచ్చాయో కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో శాంతిలాల్ కుటుంబ సభ్యులు కొంతమంది బ్యాంకు అధికారుల్ని కూడా కలిశారు. చివరికి స్థానిక ఎమ్మెల్యే నీరజ్ చోప్రా దగ్గరికి వెళ్లారు. శాంతిలాల్ కుటుంబం తరుపున ఆయన జిల్లా అధికారులకు పిటీషన్ దాఖలు చేశారు. వారికి న్యాయం చేయాలంటూ కోరారు. శాంతిలాల్ కుటంబం ఆస్తి రూ.5 నుంచి 10 లక్షల వరకే ఉంటుందని.. వాళ్లు అంత డబ్బు ఎలా కట్టగలరంటూ బ్యాంకు అధికారుల్ని ప్రశ్నించారు. ఇది తప్పుడు నోటీసని.. దీనిపై విచారణ జరిపించి వీలైనంత త్వరగా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన తాజాగా బయటకు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం