Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Strom: అస్సాంలో తుఫాను బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి, నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవు..

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) నివేదిక ప్రకారం.. ఏడు జిల్లాల పరిధిలోని 144 గ్రామాలలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వర్ష ప్రభావం మొత్తం 41,410 మంది ప్రజలుపై పడినట్లు తెలుస్తోంది.

Assam Strom: అస్సాంలో తుఫాను బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి, నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవు..
Assam Strom
Follow us
Surya Kala

|

Updated on: Apr 24, 2023 | 7:36 AM

అస్సాంలో తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను ధాటికి 7 జిల్లాల్లో 144 గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. తుఫాన్‌ ప్రభావంతో ఇద్దరు మరణించారు. 41వేల 400 మంది నిరాశ్రయులయ్యారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలకు ఒకరోజు సెలవు ప్రకటించింది అస్సాం ప్రభుత్వం.

గత 24 గంటల్లో అస్సాంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ప్రత్యేకించి టిన్సుకియా,  హోజాయ్ జిల్లాలలో వడగళ్ళతో కూడిన భారీ వర్షం కురిసింది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) నివేదిక ప్రకారం.. ఏడు జిల్లాల పరిధిలోని 144 గ్రామాలలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వర్ష ప్రభావం మొత్తం 41,410 మంది ప్రజలుపై పడినట్లు తెలుస్తోంది. హైలాకండి, టిన్సుకియా, హోజై, గోల్‌పరా, కాచర్, ధుబ్రి , బొంగైగావ్ వంటి జిల్లాలో భారీ విధ్వంసం కలిగినట్లు తెలుస్తోంది. బాధితులు 41,410 మందిలో రాష్ట్రంలో టిన్సుకియాకు చెందిన 54 గ్రామాల ప్రజలు అంటే 37,182 మంది  ప్రభావితమయ్యారు. ఇద్దరు మృతి చెందారు.

ఈ భారీ వర్షాల వలన గత 24 గంటల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఎటువంటి నివేదికలు వెలువడలేదు. అయితే, 675 ఇళ్ళు , కచ్చా  పక్కా రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తుఫాన్ ప్రభావం వలన టిన్సుకియా జిల్లా యంత్రాంగం సోమవారం జిల్లాలోని అన్ని పాఠశాలలు ,కళాశాలలకు సెలవులు ఇచ్చినట్లు ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని డిప్యూటీ కమిషనర్ స్వప్నీల్ పాల్ ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మరణించిన మృతులను రైడాంగ్ టీ ఎస్టేట్‌కు చెందిన విజయ్ మంకీ, టిన్సుకియా జిల్లాలోని బర్దూబీ టీ-ఎస్టేట్‌కు చెందిన దేవ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. అస్సాం, మేఘాలయలో కొన్ని చోట్ల ..  నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం-గురువారం వరకు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం , మేఘాలయలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..