Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. తీర్పుపై స్టే అప్పీలును తిరస్కరించిన కోర్టు
Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లు జైలుశిక్ష విధించడం సరికాదంటూ ...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లు జైలుశిక్ష విధించడం సరికాదంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దైంది. అయితే ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత పెద్ద కేసు కాదంటూ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. శిక్షను నిలిపివేయాలని లేకపోతే తన పరువు, ప్రతిష్ఠకు నష్టం కలుగుతుందని అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్‌పీ మొగేరా ఇవాళ తీర్పును వెలువరించారు.
Surat court dismisses Rahul Gandhi’s appeal for stay on conviction in defamation case
Read @ANI Story | https://t.co/wQmOw2wcvA#SuratCourt #RahulGandhi #Defamationcase pic.twitter.com/A1LP1maNKN
— ANI Digital (@ani_digital) April 20, 2023
కాగా పరువు నష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ప్రకారం తమకు ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. రాహుల్ కేసుపై గురువారం సాయంత్రం నాలుగు గంటలకు లాయర్ అభిషేక్ మనూ సింఘ్వీ.. మీడియా సమావేశంలో మాట్లాడతారని ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..