పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యా యత్నం, గన్ షాట్స్ !

పంజాబ్ లోని జలాలాబాద్ లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అయన ప్రయాణిస్తున్న వాహనంపై..

పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యా యత్నం, గన్ షాట్స్ !
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2021 | 3:24 PM

పంజాబ్ లోని జలాలాబాద్ లో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అయన ప్రయాణిస్తున్న వాహనంపై ఓ గుంపు రాళ్ళ వర్షం కురిపించింది. ఈ ఉద్రిక్తత లో కొన్ని గన్ షాట్స్ కూడా వినిపించాయి. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు కొందరు అభ్యర్థులతో ఆయన వెళ్తుండగా  ఈ దాడి జరిగింది. ఈ ఎటాక్ ని ఖండించిన శిరోమణి అకాలీదళ్ వర్గాలు., ఈ ఘటనలో కొంతమంది కార్యకర్తలకు బుల్లెట్ గాయాలైనట్టు తెలిపాయి. పోలీసుల మద్దతుతో కాంగ్రెస్ గూండాలు బాదల్ పై హత్యా యత్నం చేశారని ఈ వర్గాలు ఆరోపించాయి.  బాదల్ ను రక్షించడానికి ముగ్గురు కార్యకర్తలు పరుగులు తీయగా వారిపై కాల్పులు జరిగినట్టు పేర్కొన్నాయి. అయితే బాదల్ దీనిపై స్పందించలేదు. ఈ  దాడి తాలూకు వీడియో వైరల్ అవుతోంది.