Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి.. ట్రైన్ అద్దం ధ్వంసం.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌పై రాళ్ల దాడి ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
![Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడి.. ట్రైన్ అద్దం ధ్వంసం.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/vande-bharat-express-10.jpg?w=1280)
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌పై రాళ్ల దాడి ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. జల్‌పాయ్‌గురి నుంచి హౌరా వస్తున్న రైలుపై రాళ్లదాడి జరగడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. పోకిరీలు రాళ్లదాడి చేయడంతో రైలు బోగీ అద్దాలు పగిలాయి. బీహార్‌లోని కతిహార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రైలు అద్దం పగిలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
కతిహార్ దగ్గర రైలుపై రాళ్లదాడి జరిగడంతో కొంతసేపు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, న్యూజల్పాయ్‌గురి నుంచి శుక్రవారం సాయంత్రం 3 గంటలకు వందే భారత్ రైలు ప్రారంభమైంది. ఈ సమయంలో సాయంత్రం 4.25 గంటలకు బిహార్‌లోని డకోలా- టెల్టా స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో సీ6 కోచ్‌లోని ఓ అద్దం పగిలిందని ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదేని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన అనంతరం రైల్వే అప్రమత్తమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైల్వే శాఖ పేర్కొంది. డిసెంబర్ 30న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కాగా.. రెండ్రోజులకే వరుసగా రెండు వరుస రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. మొదట బెంగాల్‌లో వందేభారత్‌పై రాళ్ల దాడి జరగగా.. ఇటీవల సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ రైలుపై ప్రారంభానికి ముందే విశాఖలో కూడా పోకిరీలు రాళ్లు రువ్వారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/kisan-credit-card.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/11/orange-10.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/bachali-aaku.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/lic-jeevan-azad.jpg)
మరిన్ని జాతీయ వార్తల కోసం..