Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరగడుపునే కొత్తి మీర జ్యూస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి!

పరగడుపునే కొత్తి మీర జ్యూస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి!

Phani CH

|

Updated on: Feb 16, 2025 | 11:08 AM

మనిషి ఆరోగ్యానికి కావలసిన అన్ని ఔషధాలు ప్రకృతినుంచి సహజంగా లభిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో నాగరికత పేరుతో ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. జంక్‌ఫుడ్‌కి అలవాటుపడి ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. అయితే ఆకుకూరలు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు తరచూ వీటిని ఎక్కువగా తీసుకోమని సూచిస్తుంటారు.

ఆకుకూరల్లో అద్భుతమైన ఔషధగుణాలు కలిగి ఉండే ఆకకూర కొత్తిమీర. దీనిలో యాంటీఆక్సిడెంట్స్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పైబర్, విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే అది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ ఎ, సి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ మన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల మన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలకు పోషణను అందిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. కొత్తిమీర… విటమిన్లు సహా అనేక పోషకాలతో నిండి ఉంటాయి. దాని రసం మన చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ ఆవుల దొడ్డిలోకి వెళుతున్న ఓ జంతువు.. సీసీ కెమెరాలో దానిని చూసి యజమాని షాక్‌

మరో ఇంజనీరింగ్‌ అద్భుతం పంబన్ బ్రిడ్జ్‌

ఆఫీసుకి రోజూ 700 కి.మీ వెళ్ళొస్తుంది! ఎందులోనో తెలుసా

Ram Charan: నిజమే.. చరణ్ వాచ్‌ రేటుతో.. హైదరాబాద్ లో ఇల్లే కొనేయచ్చు!

‘ఈ హీరోకు ఏమైంది.. స్టార్ హీరోయిన్లు తీరు మార్చుకోవాలి’