రామ్ చరణ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! ఆరోజే ప్రకటన

15 February 2025

Basha Shek

ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ నటించిన రెండు సినిమాలు ఆచార్య, గేమ్ ఛేంజర్ ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో మెగా అభిమానులు రామ్ చరణ్  తర్వాతి సినిమా ఆర్ సీ 16( వర్కింగ్ టైటిల్) పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

విలేజ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మెగా మూవీ గురించి ఓ రెండు రూమర్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆర్ సీ 16 సినిమా స్టోరీ క్రికెట్ – రెజ్లింగ్‌ రెండు ఆట‌ల నేప‌థ్యంతో  తెరకెక్కుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

దీంతో ఈ సినిమా కథకు తగ్గట్టుగా   ప‌వ‌ర్ ఆఫ్‌ క్రికెట్ లేదా పవర్ క్రికెట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్.

కాగా గతంలో ఈ సినిమాకు పెద్ది అనే ఒక టైటిల్ వినిపించినా ఇప్పుడు పవర్ ఆఫ్ క్రికెట్ అనే పేరే ప్రముఖంగా వినిపిస్తుంది.

రామ్‌చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న దీనిపై ఒక క్లారిటీ రానుందట. ఆరోజే సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేయనున్నారని టాక్.