16 February 2025
కిస్సిక్ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. రొమాంటిక్ హీరోతో జోడి..
Rajitha Chanti
Pic credit - Instagram
పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ శ్రీలీల. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ జోడిగా ధమాకా సినిమాతో మరోసారి అలరించింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఒక్క ఏడాదిలోనే ఏకంగా అరడజను సినిమాలను ప్రకటించింది.
తెలుగులో వరుస సినిమాలతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన శ్రీలీల ఇటీవలే కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ చేసింది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. బీటౌన్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల కనిపించనున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరి కాంబోలో ఆషికీ 3 ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ శనివారం సాయంత్రం రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తుండగా.. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
హిందీలో ఫస్ట్ సినిమాతోనే రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్