Samatha Kumbh 2025: ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్‌లో ప్రతి ఘట్టం అద్భుతం.. వసంతోత్సవం వీక్షించండి
సమతా కుంభ్ -2025 శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. చినజీయర్‌స్వామి మార్గనిర్దేశంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కనరో భాగ్యము అన్నట్టుగా ముచ్చింతల్‌లో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువను తలపిస్తున్నాయి. ఆధ్యాత్మిక సంగీత నీరాజనాలు అద్వితీయం అనేలా సాగుతున్నాయి. వసంతోత్సవం వీక్షించండి
సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాల్లో ఇవాళ రెండు విశేషోత్సవాలు జరగనున్నాయి. ఒకటి వసంతోత్సవం, రెండు తెప్పోత్సవం. సాకేత లక్ష్మీ, రామచంద్రులకు జరిగే వసంతోత్సవం.. లోక కల్యాణదాయంగా భావిస్తారు. అటు.. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన తెప్పోత్సవం సాయంత్రం జరుగుతుంది.
ముచ్చింతల్‌లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో వైదిక కార్యక్రమాలతో పాటు మరెన్నో విశేష కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రోజుకో ప్రత్యేక వాహన సేవలు జరుగుతున్నాయి. సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతీ దృశ్యం రమణీయం.. ప్రతీ ఘట్టం మహాద్భుతం. ఒకేచోట శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాధీశుల కల్యాణం అంటే రెండు కళ్లూ చాలవు. వెయ్యేళ్ల క్రితం జ్ఞానయజ్ఞం చేసిన భగవద్రామానుజుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతీయేటా నిర్వహిస్తున్న సమతాకుంభ్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కడుతోంది.
కులం, మతం మనిషిని గొప్పవారిని చేయబోవు. ఆధ్యాత్మికత, అంకితభావం, కట్టుబాట్ల వల్లే మనిషి గొప్పవాడవుతాడంటాడు శ్రీరామానుజాచార్య. సమతాకుంభ్ ఉత్సవాలు అలాంటి సందేశాన్నే ఇస్తుంది. వెయ్యేళ్లు దాటినా సమతాభావం సమాజానికి పాఠాలు బోధిస్తూనే ఉంది. వార్షికోత్సవాల రూపంలో ఆ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి..

మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండి బాబోయ్..!

బీచ్‌లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో
