Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangareddy: 9 తరగతి చదువుతున్న తన కుమార్తెతో సన్నిహితంగా మెలుగుతున్నాడని...

Sangareddy: 9 తరగతి చదువుతున్న తన కుమార్తెతో సన్నిహితంగా మెలుగుతున్నాడని…

P Shivteja

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 16, 2025 | 1:38 PM

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో ఆమె తండ్రి యువకుడిని హత్య చేశాడు బాలిక తండ్రి. అనంతరం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతుడు సంగారెడ్డి శివారులోని గణపతి షుగర్ ఫ్యాక్టరీలో దశరథ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంగారెడ్డి జిల్లాలో  9వ తరగతి చదువుతున్న తన కూతురితో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ యువకుడిని హత్య చేశాడో తండ్రి. 5 రోజుల తర్వాత యువకుడు దశరథ్(26) మృతదేహం లభ్యమైంది. నిజాంపేట మండలం ఈదులతండా శివారు అటవీ ప్రాంతంలో దశరథ్ శవాన్ని ముక్కలు, ముక్కలుగా నరికి పడేసి నిప్పుపెట్టాడు నిందితుడు గోపాల్. ఇవాళ పోలీసులకు ఒక దగ్గర కాలు, చేయి లభ్యమయ్యాయి. కొండ పక్కన పూర్తిగా కాలిపోయి ఉన్న మృతదేహం లభ్యమైంది. హత్య తర్వాత శనివారం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు నిందితుడు గోపాల్.  తన కూతురితో చనువుగా ఉంటున్నాడనే గోపాల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. దశరథ్ హత్యతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలికను దశరథ్ లోబరుచుకున్నాడనే కక్షతోనే హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

Published on: Feb 16, 2025 01:37 PM