Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్‌ కాపీపై హిందీ రూపీ సింబల్‌ తొలగించిన స్టాలిన్‌ సర్కార్… తమిళనాట ముదిరిన త్రీ-లాంగ్వేజ్‌ వార్

చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటన తమిళనాడు బడ్జెట్‌ సమావేశాల్లో జరిగింది. త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న తమిళ ప్రభుత్వం... ఏకంగా బడ్జెట్‌ కాపీపై రూపీ సింబల్‌ను తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. బడ్జెట్‌ కాపీపై హిందీ రూపీ సింబల్‌ బదులు తమిళంలో రూపాయి సింబల్‌ను ప్రింట్‌ చేయడంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. హిందీ భాషాకు తాము ఎన్నటికీ వ్యతిరేకమేనంటూ ఈ విధంగా

బడ్జెట్‌ కాపీపై హిందీ రూపీ సింబల్‌ తొలగించిన స్టాలిన్‌ సర్కార్... తమిళనాట ముదిరిన త్రీ-లాంగ్వేజ్‌ వార్
Tamilnadu Logo
Follow us
K Sammaiah

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 13, 2025 | 5:00 PM

చరిత్రలో ఎన్నడూ జరగని సంఘటన తమిళనాడు బడ్జెట్‌ సమావేశాల్లో జరిగింది. త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న తమిళ ప్రభుత్వం… ఏకంగా బడ్జెట్‌ కాపీపై రూపీ సింబల్‌ను తొలగించడం తీవ్ర దుమారం రేపుతోంది. బడ్జెట్‌ కాపీపై హిందీ రూపీ సింబల్‌ బదులు తమిళంలో రూపాయి సింబల్‌ను ప్రింట్‌ చేయడంపై రాజకీయ రచ్చ నడుస్తోంది. హిందీ భాషాకు తాము ఎన్నటికీ వ్యతిరేకమేనంటూ ఈ విధంగా కూడా కేంద్రానికి తెలిసేలా చేసింది స్టాలిన్‌ సర్కార్.

బడ్జెట్‌ సమావేశాల్లో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు స్టాలిన్. హిందీని అన్ని రాష్ట్రాలపై రుద్దాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మోదీ ఆటలు తమిళనాడులో సాగవన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో త్రిభాషా విధానం అమలు కాదని మరోసారి తేల్చి చెప్పారు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు నిధులు తరలించుకుపోతున్నారంటూ మోదీపై విమర్శలు గుప్పించిన స్టాలిన్… కొత్త విద్యా విధానం అమలు చేయకుంటే నిధులు ఇవ్వబోమని బ్లాక్‌ మెయిల్‌ చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.

వీడియో చూడండి..

డీఎంకే సర్కార్‌ తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రూపీ సింబల్‌ తొలగించి ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దంగా డీఎంకే ప్రవర్తిస్తోందని కమలంపార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. డీఎంకే సర్కార్‌కు తమిళంపై ప్రేమ లేదని… జాతీయ సింబల్‌ను అవమానించి కావాలనే డ్రామా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.