Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu: బడ్జెట్‌ సందర్భంగా రూపాయి సింబల్‌ మార్చిన తమిళనాడు ప్రభుత్వం! తెరపైకి కొత్త వివాదం..

2025-26 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రూపాయి చిహ్నం (₹) స్థానంలో RS అని ఉపయోగించడం హిందీ వ్యతిరేక వాదనలకు దారితీసింది. కేంద్రం హిందీని రుద్దుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నిర్ణయంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్‌లో "ప్రతి ఒక్కరికీ ప్రతిదీ" అనే శీర్షికతో విస్తృత అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయి.

Tamilnadu: బడ్జెట్‌ సందర్భంగా రూపాయి సింబల్‌ మార్చిన తమిళనాడు ప్రభుత్వం! తెరపైకి కొత్త వివాదం..
Mk Stalin
Follow us
SN Pasha

|

Updated on: Mar 13, 2025 | 3:56 PM

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా రూపాయి చిహ్నాన్ని(₹) మార్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రూపాయి గుర్తు (₹) స్థానంలో RS. అని వాడారు. దీంతో తమిళనాడులో హిందీ వ్యతిరేక విధానానికి సంబంధించిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తమపై బలవంతంగా హిందీని రుద్దుతోందని, కేంద్ర ప్రభుత్వం మూడవ భాష నేర్చుకోవడానికి అనుమతించకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని స్టాలిన్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితిలో, 2025-26 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వ బడ్జెట్‌ను రేపు(మార్చి 14, 2025) శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఉదయం 10 గంటలకు బడ్జెట్‌పై ప్రసంగిస్తారు.

ఈ టైమ్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన సోషల్ మీడియా పేజీలో బడ్జెట్ సంబంధిత వీడియోను పోస్ట్ చేశారు. తమిళనాడు ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి “ప్రతి ఒక్కరికీ ప్రతిదీ” అనే శీర్షికతో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు, ఇది తమిళనాడు విస్తృత అభివృద్ధిని సూచిస్తుందని, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. దాని పక్కనే రూపాయికి తమిళ భాషా కోడ్, సాధారణ భారత రూపాయి చిహ్నం (₹) మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సింబల్‌ స్థానంలో తమిళంలో ఆర్‌ఎస్‌ అని పెట్టారు. దీంతో ఇది హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా చేశారని తెలుస్తోంది. అయితే తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడు రాజకీయ రంగంలో హిందీని వ్యతిరేకిండచం అనేది చాలా కాలంగా ఉంది.

ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం దీనిని తీవ్రంగా ఖండిస్తోంది. తమిళ భాషను కాపాడుకోవడానికి భారత రూపాయి చిహ్నాన్ని మార్చడం సహేతుకమైన చర్య అని కొందరు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఇదిలా ఉండగా, జాతీయ చిహ్నాలను తక్కువ చేయడం దేశాన్నే అవమానించడమేనని కొందరు సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే భాషా సమస్య కొనసాగుతున్న తరుణంలో, రూపాయి గుర్తును మార్చి బడ్జెట్ స్టాంపును విడుదల చేయాలనే ప్రభుత్వం నిర్ణయం వివాదానికి దారితీసింది. అయితే, మార్చి 14, 2025న సమర్పించనున్న బడ్జెట్ సందర్భంగా దీనికి వివరణ ఇవ్వనున్నారని సమాచారం. మరి చూడాలి సింబల్‌ మార్పుపై తమిళనాడు ఆర్థిక మంత్రి ఏం చెబుతారో.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్‌!
బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్‌!
రాబిన్‌హుడ్‌ నుంచి డేవిడ్‌ వార్నర్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌!
రాబిన్‌హుడ్‌ నుంచి డేవిడ్‌ వార్నర్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌!
చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో
చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో
ఉగాది రోజున ఆ రాశుల వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే...
ఉగాది రోజున ఆ రాశుల వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే...
విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం
విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం
పైప్‌లైన్‌లో 15 కి.మీ పాకుతూ వెళ్లి.. వీడియో
పైప్‌లైన్‌లో 15 కి.మీ పాకుతూ వెళ్లి.. వీడియో
మీ పాన్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివ్‌ చేసుకోండిలా!
మీ పాన్‌ కార్డ్‌ డీయాక్టివేట్‌ అయ్యిందా? యాక్టివ్‌ చేసుకోండిలా!
విజయవాడ నుంచి షిర్డీకి వెళ్లేందుకు టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే..
విజయవాడ నుంచి షిర్డీకి వెళ్లేందుకు టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే..
స్టార్‌ హీరో కోసం కథ రెడీ చేసిన టీమిండియా క్రికెటర్‌!
స్టార్‌ హీరో కోసం కథ రెడీ చేసిన టీమిండియా క్రికెటర్‌!
కొత్త గర్ల్ ఫ్రెండ్ గురించి ఆమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్త గర్ల్ ఫ్రెండ్ గురించి ఆమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్