ఇదీ ఇండియా ! దేశంలో బడ్జెట్ నిధుల్ని తలదన్నే బడాబాబులున్నారట!

ఇండియాలో ఏటా ప్రతి ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం సమర్పించే బడ్జెట్ నిధుల్ని తలదన్నేంత ఆదాయం కలిగిన బిలియనీర్లు ఉన్నారట. ముఖ్యంగా 2018-2019 నాటి బడ్జెట్ కేటాయింపులు, నిధులను మించిపోయి తమ ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్న కుబేరులు ఉన్నారని ‘రైట్స్ గ్రూప్’.. ‘ఆక్స్ ఫామ్ ‘  ఒక అధ్యయనంలో పేర్కొంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 50 వ వార్షిక సమావేశానికి ముందు ‘టైమ్ టు కేర్’ పేరిట వెలువరించిన స్టడీపత్రంలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2018 -2019 సంవత్సరానికి […]

ఇదీ ఇండియా !  దేశంలో బడ్జెట్ నిధుల్ని తలదన్నే బడాబాబులున్నారట!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2020 | 12:47 PM

ఇండియాలో ఏటా ప్రతి ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం సమర్పించే బడ్జెట్ నిధుల్ని తలదన్నేంత ఆదాయం కలిగిన బిలియనీర్లు ఉన్నారట. ముఖ్యంగా 2018-2019 నాటి బడ్జెట్ కేటాయింపులు, నిధులను మించిపోయి తమ ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్న కుబేరులు ఉన్నారని ‘రైట్స్ గ్రూప్’..

‘ఆక్స్ ఫామ్ ‘  ఒక అధ్యయనంలో పేర్కొంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 50 వ వార్షిక సమావేశానికి ముందు ‘టైమ్ టు కేర్’ పేరిట వెలువరించిన స్టడీపత్రంలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2018 -2019 సంవత్సరానికి గాను ఇండియన్ బడ్జెట్ రూ. 24,42,200 కోట్లట. ఇండియాలోని 63 మంది బిలియనీర్ల సంపద ఇంతకన్నా ఎక్కువేనని ఈ సంస్థ ద్వారా తెలిసింది. దేశంలోని 70 శాతం మంది జనాభా పొందుతున్న ఆదాయం కన్నా వీరి వద్ద సిరిసంపదలు ఎక్కువగానే తులతూగుతుంటాయట. అలాగే ప్రపంచంలో 2,153 మంది బిలియనీర్లు ఉన్నారని, వీరివద్ద 4.6 మిలియన్ల జనాభా ఆదాయానికి మించిన ఇన్ కమ్ఉందని ఆక్స్ ఫామ్ నివేదిక బయటపెట్టింది. మొత్తం మీద భారత దేశంలోని కోటీశ్వరుల సంపద అంతా చూస్తే ఇది ఒక పూర్తి సంవత్సరపు బడ్జెట్ కన్నా అధికమేనని తేలింది. అంటే ప్రపంచంలో ఇంకా ధనిక-పేద మధ్య వ్యత్యాసం పెరుగుతోంది కానీ తగ్గడంలేదని ఈ సంస్థ అభిప్రాయపడింది. అసమానతలను తొలగించే విధానాలను ఆయా ప్రభుత్వాలు చేపట్టకపోతే.. ఈ గ్యాప్ ఇంకా పెరుగుతుందని ఆక్స్ ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ అన్నారు. ఈ ఏడాది దవోస్ లో జరగనున్న ఆక్స్ ఫామ్ సదస్సుకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించేందుకు ఆయన ఈ నగరానికి చేరుకున్నారు. అయితే కొని దేశాలు మాత్రం ఈ వ్యత్యాసాన్ని కొంతలోకొంతయినా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయని  ఆయన తెలిపారు.