చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన సీతారాం ఏచూరి, డి.రాజా.. తప్పేముందని వ్యాఖ్య

Umakanth Rao

Umakanth Rao | Edited By: Phani CH

Updated on: Jul 29, 2021 | 4:28 PM

చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలకు సీపీఎం నేత సీతారాం ఏచూరి. సీపీఐ నేత డి.రాజా హాజరయ్యారు. వీరితో బాటు లోక్ సభ ఎంపీ సెంథిల్ కుమార్, జి. దేవరాజన్ మరి కొందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన సీతారాం ఏచూరి, డి.రాజా.. తప్పేముందని వ్యాఖ్య
Sitaram Yechury D Raja Attend China Communist Party Centenary Celebrations

చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలకు సీపీఎం నేత సీతారాం ఏచూరి. సీపీఐ నేత డి.రాజా హాజరయ్యారు. వీరితో బాటు లోక్ సభ ఎంపీ సెంథిల్ కుమార్, జి. దేవరాజన్ మరి కొందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇది జరిగినప్పటికీ,, భారత-చైనా దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వీరి చర్య వివాదాస్పదమైంది. లడాఖ్ నియంత్రణ రేఖ సమీపంలో చైనా ఇంకా తన సేనలను మోహరించే ఉందని..అక్కడ శాశ్వత కట్టడాలను నిర్మిస్తోందని ఇది భారత భద్రతకు ముప్పేనని పలు వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పైగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇటీవల టిబెట్ లోని లాసాను సందర్శించి ఇండియాను ఇరకాటాన పెట్టేట్టు చేసిన వ్యాఖ్యలను కూడా ఈ వర్గాలు గుర్తు చేశాయి. అంతేకాదు.. నాడు గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులైన అంశాన్ని కూడా ఇవి గుర్తు చేశాయి. ఇంత జరిగినా మీరు చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడంలో ఔచిత్యం ఉందా అని ప్రశ్నించాయి.

అయితే తాము ఆ ఈవెంట్ కి అటెండ్ కావడంలో తప్పేమీ లేదని, భారత-చైనా మధ్య ఉద్రిక్తతకు, దీనికి సంబంధం లేదని దేవరాజన్ అన్నారు. ఈ ఉత్సవాలను భారత ప్రభుత్వం అభినందిస్తూ చైనా ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందని అయన చెప్పారు. ఇలా ఉండగా లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద భారత-చైనా దేశాలకు చెందిన కోర్స్ కమాండర్ స్థాయి అధికారుల 12 దఫా చర్చలు త్వరలో జరగనున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Bellampalli Murder : భార్య షాహీన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. బెల్లంపల్లిలో ఘోరం

Goa Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై నోరు జారిన గోవా సీఎం.. రాజీనామాకు విపక్షాల డిమాండ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu