Sidhus Prison Diet: జైలులో సిద్దూకు అదిరిపోయే డైట్ మెనూ.. రోజ్‌మేరీ టీ మొదలు గ్రీన్ సలాడ్ వరకు..

Sidhu Special Jail Diet: జైలు అధికారులు ఇచ్చే దాల్ రోటీని తిర‌స్క‌రిస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న ఆరోగ్యం క్షీణించిందని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జైలు అధికారులు సిద్దూ ఆరోగ్య విష‌యంలో డాక్టర్లను సంప్ర‌దించారు. దీంతో డాక్లర్లు ప్ర‌త్యేకంగా ఓ డైట్ ఛార్ట్‌నే రూపొందించి..

Sidhus Prison Diet: జైలులో సిద్దూకు అదిరిపోయే డైట్ మెనూ.. రోజ్‌మేరీ టీ మొదలు గ్రీన్ సలాడ్ వరకు..
Navjot Singh Sidhu Diet
Follow us

|

Updated on: May 27, 2022 | 7:05 PM

ఖైదీ నంబర్‌ 241383..బ్యారక్‌ నంబర్‌ 7.. పంజాబ్ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ సిద్ధూకు జైల్లో కేటాయించిన నంబర్స్‌ ఇవి. 1988లో రోడ్‌ రేజ్‌ కేసులో సిద్ధూకు సుప్రీంకోర్ట్‌ ఏడాది జైలు శిక్ష విధించడంతో.. ఆయన నిన్న పాటియాలా కోర్టులో లొంగిపోయారు. దీంతో సిద్ధూకు 241383 నంబర్‌ను కేటాయించిన జైలు అధికారులు.. 7వ నంబర్‌ బ్యారక్‌లో ఉంచారు. ఆయనతో పాటు అదే సెల్‌లో మరో 8 మంది ఖైదీలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సిద్ధూ ప్రత్యర్థి, శిరోమణి అకాలీదళ్‌ నేత బిక్రమ్ సింగ్ మజీతియా సైతం ఇదే పాటియాలా జైలులో ఉన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు మజీతియా. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్‌ తూర్పు నుంచి సిద్ధూ, మజీతియా ప్రత్యర్థులుగా పోటీ చేశారు. ఐతే ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి జీవన్‌జోత్‌ కౌర్‌ చేతిలో వీరిద్దరూ ఓటమిపాలయ్యారు.

1988 నాటి రోడ్ రేజ్ కేసులో..

1988 నాటి రోడ్ రేజ్ కేసులో పంజాబ్(Punjab) కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ(Navjot Singh Sidhu)కి సుప్రీంకోర్టు గత గురువారం ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. గతంలో 2018 మార్చిలో ఈ కేసులో రూ. 1,000 జరిమానాతో సిద్ధూను విడిచిపెట్టారు. ఇప్పుడు, IPC సెక్షన్ 323 ప్రకారం గరిష్టంగా పడాల్సిన శిక్ష సిద్ధూకి విధించబడింది. 1988 డిసెంబర్ 27న గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై సిద్దూ దాడి చేయడంతో అతడు చికిత్స పొందుతూ మరణించారు. సిద్దూ రోడ్డు మధ్యలో తన జిప్సీ వాహనాన్ని నిలపడంతో.. గుర్నామ్ సింగ్ దాన్ని తొలగించాలన్నారు. మాటా మాటా పెరగడంతో గొడవ పెద్దదైంది. ఈ ఘర్షణలో గుర్నామ్‌ సింగ్ మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు కోర్టులో కేసు వేశారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసులో దాదాపు 34 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు .. తాజాగా సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. తగిన ఆధారాలు లేవంటూ 1999 సెప్టెంబర్ 22న పాటియాల కోర్టు సిద్దూను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు హరియాణా పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. 2006లో పంజాబ్‌ హైకోర్టు ఈ కేసులో సిద్దూను దోషిగా ప్రకటించి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పంజాబ్ హైకోర్టు తీర్పుపై సిద్దూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. 2018లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం సిద్దూను నిర్దోషిగా ప్రకటించి.. వెయ్యి రూపాయల జరిమానాతో సరిపెట్టింది. ఈ తీర్పుపై గుర్నామ్ కుటుంబ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. మార్చి 25న వాదనలు ముగించిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. తాజాగా ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేసింది.

అయితే.. శిక్ష తొలి రోజు నుంచి సిద్దూ జైలు భోజనం తిన‌డానికి ఏమాత్రం ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌. జైలు అధికారులు ఇచ్చే దాల్ రోటీని తిర‌స్క‌రిస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న ఆరోగ్యం క్షీణించిందని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జైలు అధికారులు సిద్దూ ఆరోగ్య విష‌యంలో డాక్టర్లను సంప్ర‌దించారు. దీంతో డాక్లర్లు ప్ర‌త్యేకంగా ఓ డైట్ ఛార్ట్‌నే రూపొందించి  జైలు అధికారుల‌కు ఇచ్చారు.

డాక్టర్లు ఇచ్చిన ప్రత్యేక ఆహార ప్రణాళికను సిద్ధం చేయాలని పాటియాలా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. సిద్ధూ కోసం సిద్ధం చేసిన డైట్ ప్లాన్‌లో బాదం, వాల్‌నట్‌లు, పాలు, చీజ్, హెర్బల్ టీతో పాటు పండ్లు ఉన్నాయి. పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రికి చెందిన ముగ్గురు సభ్యుల మెడికల్ బోర్డు సోమవారం కాంగ్రెస్ నాయకుడిని పరీక్షించిందని, ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్‌కు తన నివేదికను సమర్పించింది. ఈ మేరకు మంగళవారం స్థానిక కోర్టుకు నివేదిక సమర్పించారు.

డైట్ చార్ట్ ప్రకారం..

ఉదయం పూట రోజ్‌మేరీ టీ , అర గ్లాసు పెటా జ్యూస్ లేదా కొబ్బరి నీళ్ళు. అల్పాహారం కోసం లాక్టోస్ లేని పాలు, 1 టేబుల్ స్పూన్ గింజలు (అవిసె/పొద్దుతిరుగుడు/పుచ్చకాయ/చియా) బాదం, వాల్‌నట్‌లు, పెకాన్ గింజల వంటి గింజలు. మధ్యాహ్నానికి ఏదైనా ఒక పండు లేదా వెజిటేబుల్ జ్యూస్ ఇవ్వాలని సూచించింది.

మధ్యాహ్న భోజనంలో జొన్న పిండితో చేసిన ఒక చపాతీ, గోదుమ పిండి, రాగుల పిండితో చేసిన చపాతీలు. చపాతీలతోపాటు సీజనల్ గ్రీన్ వెజిటేబుల్స్, రైతా ఉండేలా చూడాలని సూచించింది. మధ్యాహ్న భోజనంలో బీట్‌రూట్ రైతా, ఒక గిన్నె గ్రీన్ సలాడ్, లస్సీని సిఫార్సు చేశారు డాక్టర్లు.

సాయంత్రం పూట తక్కువ ఫ్యాట్ ఉండే పాలతో చేసిన టీ , సగం నిమ్మకాయతో పనీర్ స్లైస్ . ఇక రాత్రి భోజనం కోసం మిక్స్డ్ వెజిటబుల్, దాల్ సూప్ లేదా సాల్టెడ్ గ్రీన్ వెజిటేబుల్స్‌తో బ్లాక్ చన్నా సూప్‌. చమోమిలే టీ, సైలియం పొట్టు రాత్రావేళ సిద్దూకి ఇవ్వాలని డాక్టర్లు సూచించారు.

సామాన్య ఖైదీలకు..

అయితే.. ఖైదీల ఆహారంలో తప్పనిసరిగా 600 గ్రాముల తృణధాన్యాలు, 100 గ్రాముల పప్పులు, 250 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల చేపలు లేదా మాంసం వారానికి రెండుసార్లు లేదా దాని స్థానంలో 500 ml పాలు, 15 గ్రాముల నెయ్యి లేదా 100 గ్రాముల వేరుశెనగ ఉండాలి. . ఆహారం ప్రతి ఖైదీకి చక్కెర, ఉప్పు పరిమాణాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఇది భారతీయులకు అవసరమైన ఆహారం , పోషకాహార అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

SOURCE

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!