AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2026 re-exam: నీట్ రీ-ఎగ్జామ్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. ఆన్‌లైన్‌ విధానానికి నో..!

ప్రస్తుతం ఉన్న పెన్-పేపర్ విధానానికి బదులుగా నీట్ యూజీ 2026 రీ-టెస్ట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి అభ్యర్థనలను ఇదివరకే కొట్టివేసినట్లు పేర్కొంది. పరీక్షను పునఃనిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న దశలో పరీక్షా విధానాన్ని ఎలా మార్చుతారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది..

NEET UG 2026 re-exam: నీట్ రీ-ఎగ్జామ్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. ఆన్‌లైన్‌ విధానానికి నో..!
Supreme Court on NEET UG re-exam
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 5:58 PM

Share

హైదరాబాద్‌, జూన్ 1: జూన్ 21న జరగనున్న నీట్-యుజి పునఃపరీక్ష పెన్ అండ్ పేపర్ (OMR) విధానంలోనే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా మార్చడం ఆచరణాత్మకంగా అసాధ్యమని స్పష్టం చేసింది. సమయాభావం ఎన్‌టీఏ (NTA) పై ఉన్న భారీ ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్‌జేడీ (RJD) ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. భవిష్యత్తులో నీట్ పరీక్షల సంస్కరణలు, ఆన్‌లైన్ (CBT) విధానం అమలు వంటి అంశాలపై జూలైలో విచారణ జరపనుంది.

పిటిషనర్ సుధాకర్ సింగ్ తన పిటిషన్‌లో ఎన్‌క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్లు, ఏఐ (AI) నిఘా వ్యవస్థ, ఎన్‌టీఏ స్థానంలో కొత్త అథారిటీ ఏర్పాటు వంటి ముఖ్యమైన సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై జూలైలో విచారణ జరగనుంది. మే 3 న జరిగిన నీట్ యుజి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంతో మరోసారి పరీక్షను నిర్వహిస్తుంది NTA . ఈ నేపథ్యంలో పరీక్ష విధానం మార్పు కోసం పిటిషన్ దాఖలైంది. జూన్ 21న రీ-పరీక్ష సాఫీగా పెన్ అండ్ పేపర్ మోడ్‌లోనే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను విద్యార్థులు, తల్లిదండ్రులు స్వాగతించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us