AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kusum Yojana: తస్మాత్‌ జాగ్రత్త.. రైతులను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసా..?

PM Kusum Yojana: కేంద్ర రైతుల కోసం వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు పలు పథకాలను రూపొందిస్తూ వారి నుంచి దరఖాస్తులను..

PM Kusum Yojana: తస్మాత్‌ జాగ్రత్త.. రైతులను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసా..?
Subhash Goud
|

Updated on: May 27, 2022 | 6:43 PM

Share

PM Kusum Yojana: కేంద్ర రైతుల కోసం వివిధ రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు పలు పథకాలను రూపొందిస్తూ వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం పథకాల కోసం ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లపై కేటుగాళ్లు కన్నేశారు. సేమ్‌ టు సేమ్‌ ఉండేలా నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి అమాయకులను బురిడి కొట్టి్స్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల వల్ల నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. అమాయకులను ఆసరా చేసుకుంటున్న కేటుగాళ్లు.. వారి కోసం వల వేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి రైతులను మోసగిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలకు సంబంధించి నకిలీ వెబ్‌సైట్లను గుర్తించింది కేంద్రం. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారని, ధృవీకరించని లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. దీనిపై వారికి అవగాహన కల్పిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో సోలార్ పంప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు, వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే పంపులకు సబ్సిడీ అందిస్తోంది. PM-KUSUM పథకం కింద రిజిస్టర్ కోసం కొన్ని నకిలీ వెబ్‌సైట్లు వెలువడుతున్నట్లు సమాచారం వచ్చిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫేక్ వెబ్‌సైట్‌లు పథకం నుండి లబ్ధి పొందాలనుకునే వ్యక్తుల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. Whatsapp లేదా SMS ద్వారా పంపబడిన ఏదైనా రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్‌ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

రిజిస్ట్రేషన్ ఛార్జీ పేరుతో డబ్బు జమ చేయవద్దు:

పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో డబ్బును డిపాజిట్ చేయవద్దని సూచించింది. ఈ విషయమై అందిన ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై కూడా చర్యలు చేపడుతున్నారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌లలో కొన్ని ‘.org, .in.com www.kusumojanaonline.in.net, www.pmkisankusumyojana.co.in, www.onlinekusumyojana.org.in, www.pmkisankusumyojana వంటి డొమైన్ పేర్లతో రిజిస్టర్ చేయబడ్డాయి.

ఇవి కూడా చదవండి

అందువల్ల ప్రధాన మంత్రి-కుసుమ్ యోజన కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరూ మోసపూరిత వెబ్‌సైట్‌లను సందర్శించవద్దని, ఎటువంటి చెల్లింపులు చేయవద్దని సూచించింది. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేయబడుతోంది. ఏవైనా అనుమానాలుంటే మరిన్ని వివరాల కోసం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) అధికారిక వెబ్‌సైట్ www.mnre.gov.in లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800-180-3333ని సంప్రదించాలని సూచించింది.

సోలార్ పంప్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

పీఎం కుస్మా యోజన వెబ్‌సైట్ ప్రకారం.. సౌరశక్తి పంపును ఇన్‌స్టాల్‌ చేసుకోవడం వల్ల డీజిల్, కాలుష్యం ఖర్చు తగ్గుతుంది. సోలార్ పంపుల ఏర్పాటుకు కేంద్రం నుంచి 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ ఉంటుంది. ఇది కాకుండా, బ్యాంకుల ద్వారా 30 శాతం వరకు రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. సోలార్ పంప్ 25 సంవత్సరాల పాటు ఉంటుంది. దాని నిర్వహణ కూడా సులభంగా ఉంటుంది.

Fake Websites

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి