AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.. విషయం ఏంటో గుర్తుపట్టారా..?

పుర్రెకో బుద్ధి అన్న‌ట్టు కొంద‌రు చేసే ప‌నులు చిరాకు తెప్పిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఎవ‌రికైనా తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పిస్తుంటాయి. అలాంటి ఫోటోలు, వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. వాటిని చూసిన..

Viral Photo: ఈ ఫోటోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.. విషయం ఏంటో గుర్తుపట్టారా..?
Betel Stain
Jyothi Gadda
|

Updated on: May 27, 2022 | 6:36 PM

Share

పుర్రెకో బుద్ధి అన్న‌ట్టు కొంద‌రు చేసే ప‌నులు చిరాకు తెప్పిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఎవ‌రికైనా తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పిస్తుంటాయి. అలాంటి ఫోటోలు, వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. వాటిని చూసిన నెటిజన్లు కట్టలు తెగిన ఆగ్రహంతో కామెంట్లు కుమ్మరిస్తుంటారు..తాజాగా ఇంటర్‌నెట్‌లో ఓ ఫోటో పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.  ఛీ..ఛీ వాళ్లేం మనుషులండీ..అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోపై నెటిజన్లు అంతలా ఎందుకు సీరియస్ అవుతున్నారో తెలుసుకోవాలంటే..పూర్తి కథనం చదివేయండి.

వైరల్‌గా మారిన ఈ ఫోటో ఓ ఫ్లైట్‌ విండో దగ్గర సీన్‌, ఎవరో మహానుభావులు…మంచి పాన్‌ మసాల తినేసి..ఫ్లైట్‌ విండో నుండి కిందకు ఉమ్మేసినట్టుగా ఉంది. పాన్‌ నమిలి తుప్క్‌మని ఉమ్మేసినప్పుడు ఎలాంటి మరకలు పడతాయో..అచ్చం అలాగే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోను మే 25న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ షేర్ చేశారు. దీనికి ఎలా స్పందిస్తారో మీకే వదిలేస్తున్నాను అంటూ కాప్షన్‌ ఇచ్చారు. ఇక దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఫోటోకు నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది క్షమించలేని పని అంటూ ఒక ట్విట్టర్‌ యూజర్‌ కామెంట్‌ చేయగా, విమానంలో పాన్ ఉమ్మివేసిన వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంది. అతన్ని పట్టుకుని సరైన శిక్ష విధించాలంటూ మరో యూజర్‌ కామెంట్ చేశారు. కఠిన చర్యలతో పాటు, జరిమానా కూడా విధించాలని, అతన్ని కనీసం మూడు రోజులైన జైల్లో పెట్టాలని మరికొందరు మండిపడుతున్నారు.

ఇకపోతే, మరికొందరు నెటిజన్లు పాన్‌ మసాల ప్రమోటింగ్‌ కోసం యాక్టింగ్‌ చేసిన పలువురు హీరోలే ఇలా చేసిఉంటారంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు.