KSRTC bus : డిపోలోని ఆర్టీసీ బస్సు మాయం.. ఎటుపోయిందని ఆరా తీసిన అధికారులకు షాక్

బస్సుల్లో పర్సులు కొట్టేసి పిక్‌పాకెటర్స్‌ని చూశాం...చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే తెంపుడుగాళ్లను చూశాం. అయితే ఈ దొంగ ఆ దొంగల కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టున్నాడు..అందుకే ఊరికే జేబులేం కత్తిరిస్తాం..

KSRTC bus : డిపోలోని ఆర్టీసీ బస్సు మాయం.. ఎటుపోయిందని ఆరా తీసిన అధికారులకు షాక్
Ksrtc Bus
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: May 27, 2022 | 4:23 PM

బస్సుల్లో పర్సులు కొట్టేసి పిక్‌పాకెటర్స్‌ని చూశాం…చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే తెంపుడుగాళ్లను చూశాం. అయితే ఈ దొంగ ఆ దొంగల కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టున్నాడు..అందుకే ఊరికే జేబులేం కత్తిరిస్తాం.. బస్సునే దొంగిలిస్తే పోలా అనుకున్నట్టున్నాడు.. ఏకంగా ఆర్టీసీ డిపోలో నిలిపివుంచిన బస్సునే దొంగిలించాడు. చోరీ చేస్తున్నట్టుగా ఎవరికీ కుచిత్తు అనుమానం కూడా రాకుండా, మెకానిక్‌ వేషంలో డిపోలోకి ప్రవేశించాడు..అటూ ఇటూ ఓ లుక్కేసీ ఎంచక్కా బస్సుతో చెక్కేశాడు…అందుకే ఈ దొంగను మామూలు అనలేం.. రొటీన్‌కు భిన్నమైన దొంగ అనాలి. ఈ సంఘటన కేరళలోని కొచ్చి అలువా డిపోలో చోటుచేసుకుంది. బస్సుని దొంగతనం చేస్తున్న సమయంలో డీపోలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాలు వైరల్ గా మారాయి.​

కొచ్చి పరిధి అలువా డిపోలో గురువారం ఉదయం కేఎస్‌ఆర్‌టీసీ బస్సు చోరీకి గురైంది. మెకానిక్‌ యూనిఫామ్‌లో డిపోకు వచ్చిన నిందితుడు కేఎస్ఆర్టీసీ బస్సుని దొంగిలించాడు. దూరంగా చూసిన వారు కూడా బస్సును చెకింగ్ కోసం మెకానిక్ తీసుకెళ్తున్నాడని ఉద్యోగులు, సిబ్బంది భావించారు. అయితే అతివేగంగా వస్తున్న బస్సును చూసి అనుమానం వచ్చిన సెక్యూరిటీ అధికారి డిపోకు సమాచారం అందించారు. డిపో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బస్సును ఎవరో కావాలనే తీసుకెళ్లినట్టుగా గుర్తించిన పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనం జరిగిన కొన్ని గంటల్లోనే చోరీని కేసును చేధించారు.

ఎర్నాకులంలోని కలూర్ సమీపంలో వాహనాన్ని గుర్తించారు పోలీసులు. డిపో నుంచి బస్సును తీసుకెళ్లిన నిందితులను నార్త్ పోలీసులు పట్టుకున్నారు. అతివేగంగా వస్తున్న బస్సును చూసి అనుమానం వచ్చిన సెక్యూరిటీ అధికారి డిపోకు సమాచారం అందించారు. విచారణ అనంతరం కాలూరు సమీపంలో బస్సును స్వాధీనం చేసుకున్నారు.

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ