AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone Festival: ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరించిన భారత్‌.. ఆస్టెరియా డ్రోన్‌ ఎగురవేసిన ప్రధాని మోడీ..

Bharat Drone Mahotsav 2022: కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డ్రోన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

Drone Festival: ప్రపంచ డ్రోన్ హబ్‌గా అవతరించిన భారత్‌.. ఆస్టెరియా డ్రోన్‌ ఎగురవేసిన ప్రధాని మోడీ..
Drone Festival
Sanjay Kasula
|

Updated on: May 27, 2022 | 4:13 PM

Share

ప్రపంచ డ్రోన్ హబ్ గా అవతరించే శక్తి భారత్ కు ఉందన్నారు ప్రధాని మోదీ. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ కార్యక్రమం అయిన “భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022″ను ఢిల్లీలో ప్రధాని ప్రారంభించారు.  కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డ్రోన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2022 మే 28 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో ప్రధాని మోదీ బెంగళూరుకు చెందిన ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ (Asteria Aerospace Limited) సంస్థకు చెందిన డ్రోన్‌ను ఎగరేవేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ దశాబ్దం చివరి నాటికి భారత్‌ను గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చాలనే దృక్పథాన్ని ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ విజన్‌ను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన మరోసారి గుర్తు చేశారు. గత ప్రభుత్వాల కాలంలో టెక్నాలజీని సమస్యగా చూశారు.

పేదలకు వ్యతిరేకమని చూపించే ప్రయత్నాలు జరిగాయి. అందుకనే 2014కు ముందు పాలనలో టెక్నాలజీ వినియోగం పట్ల ఉదాసీన వాతావరణం నెలకొంది. పేదలు మరింత కష్టాలు పడ్డారు. మధ్య తరగతి వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పనుల్లో ఎక్కడా నాణ్యత ఉందో చూడాల్సి వచ్చినప్పుడల్లా అకస్మాత్తుగా అక్కడికి డ్రోన్‌లను పంపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డ్రోన్‌ల సహాయంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను తాను పర్యవేక్షిస్తున్నాను అని ప్రధాని అన్నారు. కేదార్‌నాథ్‌ని పునర్నిర్మించే పని ప్రారంభించినప్పుడు.. ప్రతిసారీ అక్కడికి వెళ్లడం తనకు సాధ్యం కాదు. అందుకే తాను డ్రోన్ ద్వారా కేదార్‌నాథ్ పనిని గమనించేవాడిని అని అన్నారు. ఈరోజు ప్రభుత్వ పనుల్లో నాణ్యత చూడాలంటే అక్కడ పరిశీలనకు వెళ్లాల్సిందేనని చెప్పక తప్పదు. అప్పుడు అక్కడ అంతా బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఈవెంట్‌లో పరిశ్రమ రంగాల్లో భద్రత, నిఘా, సర్వేయింగ్, ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ల కోసం ఆస్టెరియా కఠినమైన, విశ్వసనీయమైన పనితీరుతో నడిచే డ్రోన్‌లను ప్రదర్శించింది. డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ సొల్యూషన్స్‌ని అందించే క్లౌడ్-ఆధారిత డ్రోన్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫారమ్, స్కైడెక్‌ను కూడా ప్రదర్శించింది.