AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోనులో చిరుతను పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్తులు..150 మందిపై కేసు

అటవీ శాఖ అధికారులు పట్టుకున్న ఏడేళ్ల మగ చిరుత సజీవ దహనమైంది. పౌరీ గర్వాల్ జిల్లాలోని ఓ గ్రామంలో అటవీశాఖ అధికారుల ముందే గ్రామస్తులు చిరుతను తగులబెట్టిన ఘటన సంచలనం రేపుతోంది.

బోనులో చిరుతను పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్రామస్తులు..150 మందిపై కేసు
Leopard
Jyothi Gadda
|

Updated on: May 27, 2022 | 6:36 PM

Share

అటవీ శాఖ అధికారులు పట్టుకున్న ఏడేళ్ల మగ చిరుత సజీవ దహనమైంది. పౌరీ గర్వాల్ జిల్లాలోని ఓ గ్రామంలో అటవీశాఖ అధికారుల ముందే గ్రామస్తులు చిరుతను తగులబెట్టిన ఘటన సంచలనం రేపుతోంది. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు చిరుత ఉన్న బోనుపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై పోలీసులు 150మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. అధికారులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాల్లోకి వెళితే…

పౌరి గర్వాల్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇటీవల ఒక చిరుత పులి మహిళపై దాడి చేయడంతో, ఆమె మరణిచింది. దాంతో ఆగ్రహించిన గ్రామస్తులు బోనులో పడ్డ చిరుతను కాల్చివేశారు. అయితే, మహిళపై దాడి చేసింది చిరుతపులి అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. జరిగిన ఘటనపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ మేరకు జిల్లా అటవీ అధికారి ముఖేష్ శర్మ మాట్లాడుతూ, మే 15న జిల్లాలోని సప్లోడి గ్రామంలో 47 ఏళ్ల సుష్మా దేవి అనే మహిళ చిరుత దాడి చేసిన ఆనవాళ్లతో హత్యకు గురైందని తెలిపారు. ఈ క్రమంలోనే గ్రామంలో పలుచోట్ల బోనులు ఏర్పాటు చేశారు. కాగా, మంగళవారం ఉదయం 5.20 గంటల ప్రాంతంలో బోనులో చిరుతపులి కనిపించింది. చిరుత చిక్కందని గ్రామస్తుల నుంచి సమాచారంతో అటవీ అధికారులు గ్రామానికి చేరకుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి, చిరుతను వేరే చోటుకు తరలిస్తామన్నారు.

అయితే, తమ గ్రామంలోని మహిళ మరణానికి కారణమైందన్న ఆగ్రహంతో కొందరు గ్రామస్తులు రెచ్చిపోయారు.. చిరుత ఉన్న బోను పై పెట్రోలు చల్లారు. బోనులో గడ్డి వేసి తగులబెట్టారు. దీంతో చిరుతపులి బోనులోనే సజీవ దహనమైంది. ఫారెస్టు అధికారులు వారించినా ఫలితం లేకపోయింది. పెట్రోల్‌ దాటికి మంటలు ఎగిసిపడ్డాయి. ఘటన అనంతరం చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు అధికారులు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న గ్రామస్తులపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు చెప్పారు. మృతిచెందిన చిరుత ఏడేళ్ల మగ చిరుతపులిగా అధికారులు గుర్తించారు. అదే చిరుత మహిళను చంపిందా లేదా అనేది నిర్ధారించలేకపోయామన్నారు.. గ్రామస్థులు చిరుతపై ఎందుకు దాడి చేశారనే దానిపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, 2011లో జిల్లాలోని ధామ్‌ధర్ గ్రామంలో ఆగ్రహించిన ప్రజలు అటవీ అధికారులు, పోలీసుల ముందు చిరుతపులిని సజీవ దహనం చేశారు. ఆ తర్వాత జంతువును చంపినందుకు నమోదైన కేసును ఉపసంహరించుకున్నారు. అనేక సందర్భాల్లో, చిరుతపులులు నరమాంస భక్షకులుగా మారినప్పుడు వాటిని చంపడానికి అటవీ శాఖ వేటగాళ్లను పిలుస్తుంది. 2020లో, డిపార్ట్‌మెంట్‌చే నిమగ్నమైన వేటగాళ్ళు అల్మోరా జిల్లాలో ఇద్దరు వ్యక్తులను చంపిన చిరుతపులిని కాల్చి చంపారు. ఈ ఏడాది ప్రారంభంలో, తెహ్రీలో బాలుడిని చంపిన చిరుతపులిని డిపార్ట్‌మెంట్ నియమించిన వేటగాళ్లు కాల్చి చంపారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండిః

విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి
విశాఖ అబ్బాయి వెడ్స్‌ నార్వే అమ్మాయి
ఆ నటి ధీన స్థితి గురించి చెప్తూ దాసరి కంటతడి...
ఆ నటి ధీన స్థితి గురించి చెప్తూ దాసరి కంటతడి...
ఒకప్పుడు వెండితెర ‘డ్రీమ్ గర్ల్స్’.. ఇప్పుడు రాజకీయ శివంగులు!
ఒకప్పుడు వెండితెర ‘డ్రీమ్ గర్ల్స్’.. ఇప్పుడు రాజకీయ శివంగులు!
అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
అప్పుడు క్రికెట్‏లో ఫాస్ట్ బౌలర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో పాపులర్..
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
ఇకపై UPI లావాదేవీలు ఫ్రీ కాదా? ట్రాన్సాక్షన్‌కు పడే ఛార్జి ఎంత
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, టీవీల ధరలు!
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
దేశంలో మొట్టమొదటి శక్తి దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా..?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?
స్టార్ హీరో స్టన్నింగ్ లుక్ వెనుక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా?