Shiva Temple: మతానికి అతీతంగా శివాలయాన్ని కట్టించిన క్రైస్తవ అధికారి.. ! ఎవరో తెలుసా..?
ఈ సంఘటన వివరాలు ఆలయంలోని ఒక శాసనంలో చెక్కబడి ఉన్నాయి. భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు నిర్మించిన ఏకైక హిందూ దేవాలయంగా ఈ ఆలయం ఇప్పటికీ ఉంది.
మతానికి అతీతంగా ఒక క్రైస్తవ అధికారి హిందువులు పూజించే శివాలయాన్ని కట్టించాడు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఉంది ఈ పురాతన దేవాలయం. ఇక్కడి ఆలయంలో కొలువైన మహశివుడికి భక్తులు విశేషపూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. షాజాపూర్ జిల్లాలోని అగర్‌లో ఉన్న శివాలయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే బ్రిటీష్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన మార్టిన్ అనే క్రైస్తవ అధికారి దీన్ని నిర్మించాడు.
1879లో మార్టిన్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారు. అతని భార్య మధ్యప్రదేశ్‌లో ఉండేవారు. ఉత్తరాల ద్వారా భార్యకు తన యోగక్షేమాలు తెలిపేవాడు మార్టిన్. అయితే, అకస్మాత్తుగా అతని వద్ద నుంచి ఉత్తరాలు రావడం మానేయడంతో మార్టిన్ భార్య ఆందోళనకు గురైంది. ఒకసారి అక్కడి బైజ్‌నాథ్ మహాదేవ దేవాలయం మీదుగా వెళుతుండగా గుడి లోపల నుంచి మంత్రోచ్ఛారణలు, శంఖుధ్వనులు వినబడటంతో ఆమె ఆకర్షితురాలైంది. ఉత్సుకతతో గుడి లోపలికి వెళ్లి నిల్చుంది. అక్కడ పూజలు చేస్తున్న పూజారి ఆమెను ఎందుకు కంగారు పడ్డావని అడిగాడు. అందుకు ఆమె “నా భర్త యుద్ధానికి వెళ్ళాడు. చాలా రోజులుగా అతని వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేదని, అతనికి ఏమైంది?” అంటూ బోరున విలపించింది.
పూజారులు సందర్భానుసారంగా ఆమెను ఓదార్చారు, “మీరు శివుడిని నమ్మి ప్రార్థించండి. అతను మిమ్మల్ని కష్టాల నుండి రక్షిస్తాడు.” అని చెప్పారు. పూజారులు చెప్పిన మాటలు విన్న ఆమె ఎలా ప్రార్థించాలి అని అడిగింది. అందుకు పూజారులు ‘లఘురుద్రను ఆచరించి పదకొండు రోజులు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి’ అని ఆమెకు సూచించాడు.
పదకొండు రోజుల పాటు శ్రద్ధగా మంత్రాన్ని జపించింది. పదకొండవ రోజు మార్టిన్స్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో “ఇక్కడ యుద్దభూమిలో అకస్మాత్తుగా పఠాన్‌లు మమ్మల్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. తప్పించుకునే అవకాశం లేదు. మరణం ఖచ్చితంగా అనిపించింది కాబట్టి నేను మీకు సందేశాలు పంపడం లేదు. చీకట్లో హఠాత్తుగా ఒక భారతీయ యోగి అక్కడికి వచ్చాడు. అతను ఎంతో ఠీవీగా ఉన్నాడు. ఆయుధాలు, పొడవాటి జడ, చేతిలో త్రిశూలం, తోలు దుస్తులు ధరించి, ఆశ్చర్యపరిచే వ్యక్తిత్వంతో.. చేతిలో త్రిశూలాన్ని ఊపుతున్న తీరు చూసి, పఠాన్లు ప్రాణ భయంతో పారిపోయారు. అలా నేను బతికి బయటపడ్డాను అని రాశాడు.
అంతేకాదు.. తనను కాపాడిన యోగికి మార్టిన్ కృతజ్ఞతలు చెప్పుకోగా, అంతలోనే.. ఆ యోగి ఇలా అన్నాడు.. “నీ భార్య ప్రార్థనల కారణంగా నేను నిన్ను రక్షించడానికి ఇక్కడకు వచ్చాను” అని చెప్పినట్టుగా మార్టిన్ తన ఉత్తరంలో రాశాడు. పేపర్ చదువుతున్న మార్టిన్ భార్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి తన ఇంట్లోనే శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని పూజలు చేయటం ప్రారంభించింది. అలా కొన్ని వారాల్లో మార్టిన్ తిరిగి వచ్చాడు.
In 1880s British Couple Lieutenant Colonel C Martin and His Wife Renovated Baijnath Temple of Lord Shiva In Agar Malwa, Madhya Pradesh ( Photo – https://t.co/D9ENdrnQ5X )@indiahistorypic pic.twitter.com/dzOCXSWpVJ
— Dr Andrew Fleming ?? ??????? (@Andrew007Uk) March 5, 2018
మార్టిన్ భార్య లఘురుద్రలు, ‘ఓం నమః శివాయ’ మంత్రం జపిస్తూ పూజలు చేస్తుంది. భర్తకు కూడా జరిగిన విషయం వివరించింది.. అప్పటి నుంచి దంపతులిద్దరూ శివభక్తులయ్యారు. 1883లో అతను ఆలయ నిర్మాణం కోసం పదిహేను వేల రూపాయలు చెల్లించాడు. ఈ సంఘటన వివరాలు ఆలయంలోని ఒక శాసనంలో చెక్కబడి ఉన్నాయి. భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు నిర్మించిన ఏకైక హిందూ దేవాలయంగా ఈ ఆలయం ఇప్పటికీ ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..