Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం.. కొండచరియలు విరిగిపడి 13 ఇళ్లు ధ్వంసం.. కారణం ఏంటంటే..

విపత్తు బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలను సైన్యం అందజేస్తుందని అధికారులు తెలిపారు. 33కేవీ విద్యుత్ లైన్లు, ప్రధాన నీటి పైపులైన్ల పైన కొండచరియలు విరిగిపడటంతో పెను ప్రమాదం ఏర్పడింది.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం.. కొండచరియలు విరిగిపడి 13 ఇళ్లు ధ్వంసం.. కారణం  ఏంటంటే..
Landslide
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 20, 2023 | 1:31 PM

జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 13 ఇళ్లు ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రాంబన్-సంకల్దాన్ గుల్ రహదారి పైభాగంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బాధిత కుటుంబాలన్నింటినీ ఆ ప్రాంతం నుంచి తాత్కాలిక నివాసాలకు తరలించారు రెస్క్యూ బృందాలు. విపత్తు బాధితులకు సైన్యం ఆహారం, ప్రాథమిక సౌకర్యాలను అందించినట్టుగా అధికారులు తెలిపారు. 33కేవీ విద్యుత్ లైన్లు, ప్రధాన నీటి పైపులైన్ల పైన కొండచరియలు విరిగిపడటంతో పెను ప్రమాదం ఏర్పడింది.. కొండచరియలు విరిగిపడటానికి కారణమేమిటో స్పష్టంగా తెలియరాలేదని చెప్పారు.

కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలను పరిశోధించడానికి జియాలజీ, గనుల శాఖకు చెందిన జియాలజిస్టుల బృందాన్ని పంపాలని జిల్లా కలెక్టర్ జమ్ము డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించారు. కొండచరియలు విరిగిపడటంతో రాంబన్-సంకల్దాన్ గూల్ రహదారికి అంతరాయం ఏర్పడింది.

మరోవైపు, గుల్‌ తహసీల్‌లోని ప్రధాన కార్యాలయానికి ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేసేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీరింగ్‌ ఫోర్స్‌ అధికారిని రాంబన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆదేశించారు. విపత్తు బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలను సైన్యం అందజేస్తుందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే