AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏజెన్సీలో గిరిజన మహిళ ప్రసవానికి తప్పని డోలీ కష్టాలు.. వైద్య సిబ్బందికి సైతం నరకమే..!

మెరుగైన వైద్యం కోసం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. అయితే ఎస్ కోట కు వెళ్లేందుకు ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆశా వర్కర్ ఏ ఎన్ ఎమ్ లు ఇద్దరూ డోలి కట్టి గిరిజన మహిళ నివాసముంటున్న గిరిశిఖర ప్రాంతం నుంచి క్రిందకు మోసుకు వచ్చారు.

ఏజెన్సీలో గిరిజన మహిళ ప్రసవానికి తప్పని డోలీ కష్టాలు.. వైద్య సిబ్బందికి సైతం నరకమే..!
Tribal Women
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 20, 2023 | 11:25 AM

గిరిజన సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నామని ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి. గిరిపుత్రుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని అంటున్నాయి. కానీ, వాస్తవ గిరిజనుల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో గిరిజనుల గోడు వినే నాధుడే లేకుండా పోయారు. అడుగడుగున సౌకర్యాలతో, ఇబ్బందులతో పడరాని పాట్లు పడుతున్న గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి కష్టాలను తీర్చి కన్నీళ్లను తుడిచే నాయకులు లేరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యం కోసం గిరిపుత్రులు పడరాని పాట్లు పడాల్సి వస్తుంది. ఇక గర్భిణీల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.

విజయనగరం జిల్లాలో డోలి కష్టాలు కొనసాగుతున్నాయి.. ఎస్ కోట మండలం గుడిలోవ గిరిశిఖర ప్రాంతంలో నివసిస్తున్న జన్ని మంగ అనే గిరిజన మహిళకు నెలలు నిండక ముందే పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో శనివారం తెల్లవారుజామున మగ బిడ్డను ప్రసవించింది. అయితే, కడుపునొప్పితో భాధ పడుతుండటంతో ఆ గిరిజన మహిళ భర్త ఎస్.కోటలో ఉన్న ఏ ఎన్ ఎమ్ లకు సమాచారం అందించారు. హుటా హుటిన ఆ గ్రామ ఏ ఎన్ ఎమ్ చదరం పార్వతీదేవి, ఆశా వర్కరు లక్ష్మి ఇద్దరు ఆ గిరిజన మహిళ వద్దకు చేరుకొని ప్రాథమిక వైద్యం అందించారు. తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారు.

అయితే, మరింత మెరుగైన వైద్యం కోసం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. అయితే ఎస్ కోట కు వెళ్లేందుకు ఎటువంటి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆశా వర్కర్ ఏ ఎన్ ఎమ్ లు ఇద్దరూ డోలి కట్టి గిరిజన మహిళ నివాసముంటున్న గిరిశిఖర ప్రాంతం నుంచి క్రిందకు మోసుకు వచ్చారు. మహా శివరాత్రి కావడం ఆ గ్రామంలో ఎవరూ అందుబాటులో లేకపోవడం వల్ల వైద్య సిబ్బంది ఇద్దరే కష్టపడి డోలి మోయాల్సి వచ్చింది..

ఇవి కూడా చదవండి

అయితే కొంత దూరం వచ్చిన తరువాత ఆ బాలింత కొండదిగువకు రావడానికి ఇష్టపడక పోవడంతో ఆదివారం మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి వైద్యం అందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..