Kotappakonda: కోటప్పకొండ తిరునాళ్లు అంటే ఆ మాత్రం ఉంటది మరి.. రికార్డు స్థాయిలో గలగలలాడిన హుండీలు..

కోటప్పకొండ అనగానే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది తిరునాళ్లు, ప్రభలు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో.. అశేష భక్త జన సందోహం మధ్య జరిగే కోటయ్య ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా చుట్టుపక్కలా..

Kotappakonda: కోటప్పకొండ తిరునాళ్లు అంటే ఆ మాత్రం ఉంటది మరి.. రికార్డు స్థాయిలో గలగలలాడిన హుండీలు..
Kotappakonda Temple
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 20, 2023 | 9:54 AM

కోటప్పకొండ అనగానే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది తిరునాళ్లు, ప్రభలు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో.. అశేష భక్త జన సందోహం మధ్య జరిగే కోటయ్య ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా చుట్టుపక్కలా రాష్ట్రంలోనూ చాలా ఫేమస్. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ శివ నామ స్మరణతో మార్మోగింది. భక్తుల రాకతో త్రికూట పర్వతం సందడిగా మారింది. పంచాక్షరి మంత్రంతో భక్తులు తన్మయత్వం పొందారు. ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకున్నారు. కోటప్పకొండలో నిర్వహించిన శనివారం తిరునాళ్ల మహోత్సవంలో భక్తులు వివిధ రూపాల్లో రూ. కోటి 73లక్షల 67వేల 386 ఆదాయం త్రికోటేశ్వరునికి సమర్పించారు.

వివిధ రకాల పూజ టిక్కెట్ల ద్వారా రూ.65,01,240, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 35,00,025 వచ్చింది. అన్నదానం కానుకల ద్వారా రూ.1,21,321, హుండీల కానుకల ద్వారా రూ.72,44,803 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారి వేమూరి గోపి తెలిపారు. గతేడాది ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది రూ.4,30,519 ఆదాయం అదనంగా వచ్చింది. తిరునాళ్లలో చివరి ఘట్టంగా లింగోద్భవ కాలంలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాగారం చేశారు. ప్రత్యేక పూజలు, అభిషేక మహోత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ క్షేత్రంలో ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే స్వామి వారిని దర్శించుకుంటారు. గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోటప్పకొండకు ప్రభలు కట్టుకుని వెళతారు. ప్రభల విషయంలో గ్రామాల మధ్య పోటీ కూడా ఉంటుంది. ఈ ప్రభలపై ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ ను చూస్తూ భక్తులు జాగారం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో