AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri: యాదాద్రి నారసింహుడి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. రేపటి నుంచే ప్రారంభం.. కన్నుల పండువగా ఉత్సవాలు..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునర్నిర్మించిన యాదాద్రి ఆలయంలో.. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ( రేపు ) నుంచి..

Yadadri: యాదాద్రి నారసింహుడి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. రేపటి నుంచే ప్రారంభం.. కన్నుల పండువగా ఉత్సవాలు..
Yadagirigutta Temple
Ganesh Mudavath
|

Updated on: Feb 20, 2023 | 12:30 PM

Share

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునర్నిర్మించిన యాదాద్రి ఆలయంలో.. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ( రేపు ) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువుతు ముగుస్తాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అలంకరణ కోసం మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన చాట్ల ప్యాట్నీ సెంటర్‌ యాజమాన్యం పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా.. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి తిరు కల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.

21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన, 22న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానంహవనం ఉంటుంది. 23 న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ ఉంటుంది. 24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ, 25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ, 26న ఉదయం 9 గంటలకు గోవర్దన గిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన అలంకార సేవ ఉంటుంది.

27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం, ఫిబ్రవరి 28 న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, మార్చి 1న ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం, మార్చి 2న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, 3న ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం