Bhatti Vikramarka: దేవుడు కరుణిస్తే ‘మధిర’నే చక్రం తిప్పుతుంది.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..
మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుత్తున్నాయి. భట్టి విక్రమార్క మాటల వెనుక ఆంత్యరం ఏంటీ.. అనేది కాంగ్రెస్, సహా పలు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుత్తున్నాయి. భట్టి విక్రమార్క మాటల వెనుక ఆంత్యరం ఏంటీ.. అనేది కాంగ్రెస్, సహా పలు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలో శనివారం నిర్వహించిన మహా శివరాత్రి జాతరలో పాల్గొన్న మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క.. పలు వ్యాఖ్యలు చేశారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించిన భట్టి విక్రమార్క.. అనంతరం మాట్లాడిన మాటలు అటు కాంగ్రెస్, ఇటు రాజకీయంగా ఆలోచింపచేస్తున్నాయి. మధిర నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పనులు చేయనంటూ భట్టి వ్యాఖ్యానించారు. చిన్న పొరపాట్లు చేసిన నాకు వెన్నంటూ ఉండి మూడు సార్లు గెలిపించారని చెప్పారు భట్టి. అభివృద్ధి విషయంలో మధిర ప్రజలు తలెత్తుకొని తిరిగేలా నియోజకవర్గాన్ని డవలప్ చేశానన్నారు.
చిన్న చిన్న పొరపాట్లు చేసిన తన వెంట ఉండి ఓట్లు వేసి తనను మూడు సార్లు గెలిపించారంటూ పేర్కొన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు తలెత్తుకుని తిరిగేలా నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి చేశానన్నారు. భగవంతుడు, పరమ శివుడు కరుణిస్తే మధిర నియోజకవర్గమే ఈ రాష్ట్రానికే ఓ దశదిశ చూపేలా.. పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు.
కాగా.. భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలు టీపీసీసీ వర్గాలతోపాటు.. ఖమ్మం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..