AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల లేని చేప సరస్సు చుట్టూ ఈదుతోంది..! వీడియో చూసి భయపడుతున్న నెటిజన్లు…

ఇలాంటి విచిత్రమైన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయ్యారు. వీడియోపై భిన్నమైనన కామెంట్స్ చేస్తున్నారు.

తల లేని చేప సరస్సు చుట్టూ ఈదుతోంది..! వీడియో చూసి భయపడుతున్న నెటిజన్లు...
Headless Fish Swimming
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 20, 2023 | 8:55 AM

అనేక నివేదికలు భూకంపాలకు ముందు జంతువులు అసాధారణ ప్రవర్తనను ప్రదర్శిస్తాయంటారు. పక్షులు, ఇతర జంతువులు అస్థిరంగా ప్రవర్తించడం, చంచలంగా మారడం, ఆ ప్రాంతం నుండి పారిపోవడం వంటివి చేస్తుంటాయని అంటారు. అయితే, అన్ని ప్రకంపనలు అటువంటి ప్రవర్తనకు ముందు ఉండవంటారు. భూకంపాలకు ముందు అన్ని జంతువులు అసాధారణ ప్రవర్తనను ప్రదర్శించవని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ జీవి కూడా తల లేకుండా మనుగడ సాగించడం అసంభవం. ఎందుకంటే తలలో మెదడు, ముక్కు వంటి ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. ఇవి శ్వాస, ఇతర శారీరక విధులకు అవసరమైనవి. అయితే, చెరువులో తల లేకుండా ఈత కొడుతున్న చేపకు సంబంధించిన వైరల్ క్లిప్ ఒకటి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమై నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేసింది. వైరల్‌ అవుతున్న వీడియోలో ఆ చేపకి తల భాగం లేదని తెలుస్తోంది. కానీ, రెండు కళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ, ఆ చేపను ఎవరో ఒక వ్యక్తి తాకినప్పుడు అది కదులుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. తలకుండానే మొండి శరీరంతో కనిపించిన చేపను చూసిన నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Twitter వినియోగదారు OddIy Terrifying ఈ 14-సెకన్ల నిడివి గల వీడియోను మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో షేర్‌ చేశారు. దీనికి తల లేకుండా ఈత కొడుతోంది” అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆ చేప గురించి కానీ, దానిని ఎక్కడ గుర్తించారనే ప్రదేశం గురించి కానీ పెద్దగా సమాచారం లేదు.

ఆన్‌లైన్‌లో షేర్‌ చేసిన తర్వాత, వీడియో 1.5 మిలియన్లకు పైగా వ్యూస్‌, 2043 రీట్వీట్‌లను సేకరించింది. ఇలాంటి విచిత్రమైన క్లిప్‌ను చూసి సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయ్యారు వ్యాఖ్యల విభాగంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..