Sleeping Problems: రాత్రి సరిగా నిద్రపట్టక అవస్థలు పడుతున్నారా..? ఇంటి నివారణలు చక్కటి పరిష్కారం..

ఉద్యోగస్తులకైతే మరీ కష్టం రాత్రిళ్లు నిద్ర లేకపోవడం ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. పైగా నిద్రలేమి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమికి ఆయుర్వేదంలో కొన్ని రకాల చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.

Sleeping Problems: రాత్రి సరిగా నిద్రపట్టక అవస్థలు పడుతున్నారా..? ఇంటి నివారణలు చక్కటి పరిష్కారం..
Sleeping Problems
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 21, 2023 | 6:51 AM

ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మంది రాత్రంతా నిద్ర లేకుండా గడుపుతారు. ఉద్యోగస్తులకైతే మరీ కష్టం రాత్రిళ్లు నిద్ర లేకపోవడం ఉదయాన్నే ఆఫీసులో నిద్ర రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. పైగా నిద్రలేమి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమికి ఆయుర్వేదంలో కొన్ని రకాల చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. రాత్రుళ్లు నిద్ర సరిగా పట్టకపోతే, ఏం చేయాలో తెలుసుకుందాం.

సాధారణ నిద్రకు మేల్కొనే సమయం చాలా ముఖ్యం. రోజూ నిర్ణీత సమయానికి పడుకోకపోతే నిద్రలేమి సమస్య పెరుగుతుంది. అలాంటప్పుడు మంచి నిద్ర పొందడానికి కుంకుమపువ్వు సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తాగడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.

నిద్రలేమి సమస్యకు మరో ఇంటి చిట్కా కూడా చక్కగా పనిచేస్తుంది. మీరు రాత్రిపూట సరిగా నిద్రపట్టక అవస్థలుపడుతున్నట్టయితే, జాజికాయ మంచి నిద్రను పొందేందుకు సహాయపడుతుంది. కాబట్టి మీరు పడుకునే ముందు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. రాత్రి నిద్రను మెరుగుపరచడంలో ఇది చాలా సహాయపడుతుంది. అందుకే రాత్రి నిద్ర రాకపోతే పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగండి.

ఇవి కూడా చదవండి

నిద్రలేమితో బాధపడుతుంటే తలకు, పాదాలకు నూనె రాసుకుని సరిగ్గా మసాజ్ చేయడం వల్ల చాలా ఉపశమనం పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. ఇలా చేయడం వల్ల ప్రశాంతమైన, మంచి నిద్రను పొందుతారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..