AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: భారత్‌కు అది గర్వకారణం.. జీ20 పై శశిథరూర్ ప్రశంసల జల్లు

భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు రెండో రోజు కొనసాగుతుంది. అయితే ఈ సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కరిపించారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం వల్ల భారత్ కృషిని ఆయన కొనియాడారు. అలాగే ఇది భారత్‌కు ఎంతో గర్వకారణమని అన్నారు. అలాగే మన దేశం తరపున షెర్పాగా ఉన్నటువంటి అమితాబా కాంత్ పాత్రను సైతం ఆయన అభినందించారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో శశిథరూర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

G20 Summit: భారత్‌కు అది గర్వకారణం.. జీ20 పై  శశిథరూర్ ప్రశంసల జల్లు
Shashi Tharoor
Aravind B
|

Updated on: Sep 10, 2023 | 2:36 PM

Share

భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు రెండో రోజు కొనసాగుతుంది. అయితే ఈ సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కరిపించారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం వల్ల భారత్ కృషిని ఆయన కొనియాడారు. అలాగే ఇది భారత్‌కు ఎంతో గర్వకారణమని అన్నారు. అలాగే మన దేశం తరపున షెర్పాగా ఉన్నటువంటి అమితాబా కాంత్ పాత్రను సైతం ఆయన అభినందించారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో శశిథరూర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం విషయంలో.. ఢిల్లీ డిక్లరేషన్ తీర్మానంలో భారత్ చెప్పినటువంటి పేరాకు సభ్యదేశాలు కూడా ఆమోదం తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏకాభిప్రాయం ఎలా సాధ్యమైనందనే దానిపా భారత్ షెర్పాగా ఉన్న అమితాబ్ కాంత్ ఓ ఇంటర్యూలో దీని గురించి చెప్పారు.

ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ కథనాన్ని ట్యాగ్ చేసిన శశి థరూర్.. అమితాబా కాంత్ బాగా పనిచేశారు అని అన్నారు. మీరు ఐఏఎస్ ఎంచుకున్నప్పుడు.. ఐఎఫ్‌ఎస్ దూకుడైన దౌత్యవత్తను కోల్పోయిందని అన్నారు. ఇక రష్యా, చైనాతో జరిపిన చర్చ తర్వాత ఢిల్లీ డిక్లరేషన్‌పై ఓ ముసాయిదాను రూపొందించినట్లు పేర్కొన్నారు. అలాగే జీ 20 సదస్సులో ఇది భారత్‌కు ఎంతో గర్వకారణం అని శశిథరూర్ అన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు.. పలు అంశాలపై కూడా దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలడం భారత్‌కు అతిపెద్ద విజయమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఉక్రెయిన్ యుద్ధం అంశం విషయంలో కూడా తలెత్తినటువంటి పీటముడిని చాకచాక్యంగా పరిష్కరించగలిగినట్లు పేర్కొన్నారు. అలాగే సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం వల్ల అన్ని దేశాలు తమ మద్ధతును ఇండియా సాధించినట్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి ఈ ప్రకటనను కూడా అగ్రదేశాలు భారత్‌పై ప్రశంస వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ జీ20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు భారత దౌత్యవేత్తల బృందం కృషి చేసినట్లు షెర్పా అమితాబ్ కాంత్ చెప్పారు. అలాగే దాదాపు 200 గంటల పాటు చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే అదనపు కార్యదర్శులైనటువంటి ఈనం గంభీర్, కె. నాగరాజు నాయుడితో దౌత్యవేత్తల బృందం 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం వివాదస్పదంగా ఉన్న ఉక్రెయిన్ అంశంపై ఇతర దేశాల్లో తమ సహచరులతో సుమారు 15 మంది పంచుకున్నట్లు తెలిపారు.