Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: గ్లోబల్ లీడర్‌లతో ప్రధాని మోడీ ప్రత్యేక బంధం.. విందులో సందడి చేసిన ప్రతిపక్ష నేతలు..

దేశ రాజధాని ఢిల్లీలో వసుదైక కుటుంబం థీమ్‌తో జీ20 సదస్సు జరుగుతోంది. ప్రపంచంలోని ప్రముఖ దేశాలన్నీ ఢిల్లీలోనే ఉన్నారు. దేశాధినేతల కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ డిన్నర్ కార్యక్రమానికి ముందు ఫొటో సెషన్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ లీడర్‌లతో ప్రధాని మోడీకి ఉన్న ప్రత్యేక బంధం కనిపించింది. ప్రతిపక్ష నాయకులు కూడా ప్రధానితో కనిపించారు.   G20 శిఖరాగ్ర సమావేశం అద్భుతంగా సాగుతుందని అనడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా షేర్ చేసిన ఫొటోలే ఇందుకు నిదర్శనం. రాత్రి భోజనం అనంతరం నేతలు ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకున్నారు. విపక్షాల ముఖ్యమంత్రులతో ఉన్న ఫోటోలు కూడా ప్రధాని మోడీ షేర్ చేశారు.

Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 10, 2023 | 5:46 PM

G20 శిఖరాగ్ర సదస్సు తొలిరోజు సాయంత్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ, భారతీయ నేతలను విందుకు ఆహ్వానించారు. విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విదేశీ నేతల కోసం ఇస్తున్న విందు కావడంతో క్యాటరింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రధాని నరేంద్ర మోడీతో సెల్ఫీ దిగుతూ కనిపించారు.

1 / 6
జీ20 సదస్సులో భారత అధ్  రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందుకు చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా హాజరయ్యారు.. ప్రధాని మోడీతో పాటు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తో సరదాగా సంభాషించినట్లు ఫోటో చుస్తే తెలుస్తుంది.

2 / 6

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ సంస్థల నేతలతో సమావేశమయ్యారు. ఈ చిత్రంలో IMF మేనేజింగ్ డైరెక్టర్ జార్జివా వోర్ తో పాటు ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా ఉన్నారు.

3 / 6
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రధాని మోడీ ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు. ఈ చిత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విందుకు హాజరయ్యారు.

4 / 6
రాష్ట్రపతి ఆహ్వానం మేరకు హాజరైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్ ను ప్రధాని మోడీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. 

5 / 6
ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కూడా ఉన్నారు.

6 / 6
Follow us