Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jharkhand: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా-ముంబై రైలు.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం.. పలువురికి గాయాలు

ప్రమాదం జరిగిన సమయంలో హౌరా మెయిల్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి సీఎస్‌ఎంటీ ముంబైకి వెళ్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు రాజ్‌ఖర్స్వాన్ నుంచి బడాబాంబో వైపు వెళ్తున్న సమయంలో జార్ఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్‌పూర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు మరో ట్రాక్‌పైకి గూడ్స్‌ రైలు బోగీలు ఒరిగిపోయాయి. ఇంతలో వెనుక నుంచి అదే లైన్ లోకి వచ్చిన హౌరా-ముంబై మెయిల్ బోగీలను ఢీకొంది.

Jharkhand: జార్ఖండ్‌లో పట్టాలు తప్పిన హౌరా-ముంబై రైలు.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం.. పలువురికి గాయాలు
Howara Csmt Express Goods Train Incident
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2024 | 7:41 AM

నెల రోజుల క్రితం కంచన్‌ జంగా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం జరిగిన ఘటన ఇంకా మరచిపోక ముందే మళ్ళీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హౌరా నుంచి ముంబై వెళ్తున్న హౌరా మెయిల్ జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 18 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కొందరు మృతి చెంది ఉండవచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు ఇంకా మరణాలను ధృవీకరించలేదు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రాజ్‌ఖర్‌స్వాన్, బడాబాంబో మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హౌరా మెయిల్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి సీఎస్‌ఎంటీ ముంబైకి వెళ్తోంది.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రైలు రాజ్‌ఖర్స్వాన్ నుంచి బడాబాంబో వైపు వెళ్తున్న సమయంలో జార్ఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్‌పూర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు మరో ట్రాక్‌పైకి గూడ్స్‌ రైలు బోగీలు ఒరిగిపోయాయి. ఇంతలో వెనుక నుంచి అదే లైన్ లోకి వచ్చిన హౌరా-ముంబై మెయిల్ బోగీలను ఢీకొంది. ప్రమాదంలో మొత్తం బోగీలు పట్టాలు తప్పాయి. అయితే హౌరా మెయిల్ డ్రైవర్ ఈ ప్రమాదాన్ని సకాలంలో గ్రహించాడు.. తెలివిగా వ్యవహరించి హోరా ముంబై రైలుకి జరగాల్సిన ఘోర ప్రమాదాన్ని నివారించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ తెలివి కారణంగానే ప్రయాణీకులెవరూ మరణించలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

గతనెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో దాదాపు ఇదే తరహా ప్రమాదం జరిగింది. కంచన్‌ జంగా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో పదిమంది చనిపోయారు. ఆ ప్రమాదం జరిగి నెలరోజుల తర్వాత మళ్ళీ ఘోర రైలు ప్రమాదం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..