Kerala landslides: కేరళలో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు..ఐదుగురు మృతి.. శిధిలాల కింద వందలాది మంది..

అన్ని ప్రభుత్వ సంస్థలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కార్యకలాపాలు సమన్వయంతో జరుగుతాయి, సహాయ కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి రాష్ట్ర మంత్రులు కొండ జిల్లాకు చేరుకుంటారని సీఎం కార్యాలయం నుంచి విడుదల అయిన ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు  ముండకైలో కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం రోడ్లు అన్నీ కొండ చరియలతో బ్లాక్ చేయబడి ఉన్నాయి.

Kerala landslides: కేరళలో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు..ఐదుగురు మృతి.. శిధిలాల కింద వందలాది మంది..
Massive Landslides Hit Kerala
Follow us

|

Updated on: Jul 30, 2024 | 8:09 AM

కేరళలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వందలాది మంది శిధిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) బాధిత ప్రాంతంలో ఫైర్ ఫోర్స్ , NDRF బృందాలను మోహరించినట్లు తెలిపింది. అంతేకాదు సహాయక చర్యలకోసం ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన మరో బృందం తమిళనాడు లోని అరకోణం నుంచి వాయనాడ్‌కు తరలించారు.

KSDMA ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ కు చెందిన రెండు బృందాలను కూడా రెస్క్యూ ప్రయత్నాలలో సహాయం చేయడానికి వాయనాడ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే ఆదేశాల్ మేరకు ఈ బృందాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. కొండ చరియల కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని భయాందోళన చెందుతున్నట్లు బాధిత ప్రాంతాల స్థానికులు తెలిపారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

అన్ని ప్రభుత్వ సంస్థలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కార్యకలాపాలు సమన్వయంతో జరుగుతాయి, సహాయ కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి రాష్ట్ర మంత్రులు కొండ జిల్లాకు చేరుకుంటారని సీఎం కార్యాలయం నుంచి విడుదల అయిన ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు  ముండకైలో కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం రోడ్లు అన్నీ కొండ చరియలతో బ్లాక్ చేయబడి ఉన్నాయి. దీంతో రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు.

భారీ వర్షం తర్వాత విరిగిపడిన కొండచరియలు

వాస్తవానికి కేరళలోని వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిధిలాలల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే బాధితుల సహాయార్ధం జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిందని, అత్యవసర సహాయం కోసం 9656938689 , 8086010833 హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు ఎంఐ-17, ఒక ఏఎల్‌హెచ్ సూలూరు నుంచి ఉదయం 7.30 గంటలకు బయలు దేరాయి.

వైతిరి, కల్పత్త, మెప్పాడి, మనంతవాడితో సహా ప్రాంతంలోని అన్ని ఆసుపత్రులు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. అత్యవసర సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆరోగ్య కార్యకర్తలు సేవలను అందించడానికి సంఘటన స్థలానికి, ఆస్పత్రుల వద్దకు హుటాహుటిన చేరుకున్నారని, మరింత సహాయాన్ని అందించడానికి అదనపు బృందాలను వయనాడ్‌కు మోహరించనున్నట్లు జార్జ్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
GHMC లో రేపటి నుంచి ప్రాపర్టీ సర్వే
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
అక్రమ కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ శాఖ ఉక్కుపాదం
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! వైరల్‌ వీడియో
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జరిమానా.. ఎన్ని రూ.వేలు కట్టాలో తెలుసా ?
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌
నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌