Lucknow building collapse: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే షాహిద్ మన్జూర్ కుమారుడు నవాజిష్ సాహిద్‌ను పోలీసులు బుధవారం (జనవరి 25) అరెస్టు చేశారు..
లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సమాజ్‌వాదీ పార్టీ (SP) ఎమ్మెల్యే షాహిద్ మన్జూర్ కుమారుడు నవాజిష్ సాహిద్‌ను పోలీసులు బుధవారం (జనవరి 25) అరెస్టు చేశారు. అలయా అపార్ట్‌మెంట్ కేసులో నిన్నరాత్రి మీరట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నవాజ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సుమారు గంటసేపు ప్రశ్నించిన అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో లక్నోకు తరలించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే షాహిద్ మన్జూర్ కుంటుంబం సిటీ వదిలి ఎక్కడికీ వెళ్లకుండా నోటీసులు సైతం జారీ అయ్యాయి. అరెస్టుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సుమారు 12 ఏళ్ల క్రితం (2009) దాదాపు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 12 ఫ్లాట్లు కలిగిన అలయా అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. అప్పటి మార్కెట్ విలువను బట్టి రూ.36.3 లక్షల ధర పలుకుతున్నప్పటికీ నవాజీష్ మంజూర్ కేవలం రూ. 20 లక్షలకు కొనుగోలు చేశాడు. అనంతరం ఎమ్మెల్యే మంజూర్ మనవరాలు, నవాజిష్ కుమార్తె అయిన అలయ పేరును అపార్ట్‌మెంట్‌కు పెట్టారు. మంగళవారం మధ్యాహ్నం నార్త్ ఇండియాలో పలు చోట్ల భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.8గా నమోదైంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 6.45 గంటల సమయంలో ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలిపోయింది. 4 అంతస్తులు కలిగిన ఈ అపార్ట్‌మెంట్‌లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ సదుపాయం లేకపోవడంతో నివాసితులు సిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో రెస్క్యూ టీం గడచిన 14 గంటల్లో ముగ్గురు మృతి చెందగా, 14 మందిని రక్షించారు. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు యూపీ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. భవంతి కూలిపోవడానికి కారణాలను ఇంకా నిర్ధారించాల్సి ఉందని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడేందుకు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ తెలిపారు.
मेरठ सपा विधायक शाहिद मंजूर के बेटे को कड़ी सुरक्षा में लखनऊ भेजा गया मेरठ में घंटो पूछताछ के बाद भेजा गया लखनऊ, अलाया अपार्टमेंट मामले में की जाएगी पूछताछ, अलाया अपार्टमेंट की जमीन है सपा विधायक शाहिद मंजूर के बेटे नवाजिश और भतीजे तारिक के नाम#lucknowbuildingcollapse pic.twitter.com/glP0eJVNi4
— MSB News (@PBusiness_1) January 25, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.