Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులకు కుల బహిష్కరణ..! అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..

కాలం మారుతున్నా.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోన్న మన దేశంలో కుల వివక్ష మాత్రం ఇంకా నివురుగప్పిన నిప్పులా తన ఉనికిని చాటుతూనే ఉంది. తాజాగా భారత రక్షణ దళంలో పని చేస్తున్న ఇద్దరు ఆర్మీ అధికారులను ఓ గ్రామం..

Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులకు కుల బహిష్కరణ..! అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు..
Army Officers
Follow us

|

Updated on: Jan 25, 2023 | 4:00 PM

కాలం మారుతున్నా.. అభివృద్ధి పథంలో దూసుకుపోతోన్న మన దేశంలో కుల వివక్ష మాత్రం ఇంకా నివురుగప్పిన నిప్పులా తన ఉనికిని చాటుతూనే ఉంది. తాజాగా భారత రక్షణ దళంలో పని చేస్తున్న ఇద్దరు ఆర్మీ అధికారులను ఓ గ్రామం వెలివేసింది. అందుకు కారణం కులాంతర వివాహం చేసుకోవడమే. ఒడిసాలో చోటు చేసుకున్న ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనగా మారింది. ఒడిశాలోని గంజాం జిల్లా చెందిన అరవింద్‌ కుమార్‌, బినయ్‌ కుమార్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు భారత ఆర్మీలో పని చేస్తున్నారు. ఒకరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో, మరొకరు ఇండియన్ నేవీలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు పోల్సర పోలీస్ స్టేషన్ పరిధిలోని కలంబ గ్రామానికి చెందినవారు. వీరు ప్రధాన్ బలాసి కులానికి చెందినవాళ్లు. ఐదే తాజాగా నేవీలో పనిచేసే అర్బింద్ కుమార్ ఖండయత్ కులానికి చెందిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అతని సోదరుడు బినయ్‌ కుమార్‌ కూడా ఇదే మాదిరి కులాంతర వివాహం చేసుకున్నాడు.

ఈ ఇద్దరు సోదరులకు ఇటీవల పెళ్లిళ్లు జరిగాయి. అయితే కులాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించే ఆ గ్రామస్తులు వారిద్దరిపై సామాజిక బహిష్కరణ విధించారు. బంధువులెవరూ వారి ఇళ్లకు రావడం లేదు. ఏ కార్యక్రమానికి వారిని పిలవడం లేదు. మరోవైపు గ్రామస్తులు విధించిన సామాజిక బహిష్కరణ పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన అరవింద్‌ కుమార్‌, వినయ్‌ కుమార్‌ ఈ సామాజిక దురాచారాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ వల్ల తాము ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నట్లు వాపోయారు. తమకు న్యాయం చేయాలని ఎన్‌హెచ్‌ఆర్సీని కోరారు. సొంత గ్రామంలో సామాజిక జీవితానికి దూరంగా శాపగ్రస్తుల్లా బతుకుత్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.