Sadhguru- Eternal Echoes: ఎటర్నల్ ఎకోస్.. సద్గురు కవిత్వం, గీతాలాపనపై మీరూ ఓ లుక్కేయండి
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కవిత్వంపై చేసిన తొలి స్పోకెన్ ఆల్బమ్, ఎటర్నల్ ఎకోస్‌ను ఆవిష్కరించారు. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కవిత్వంపై చేసిన తొలి స్పోకెన్ ఆల్బమ్, ఎటర్నల్ ఎకోస్‌ను ఆవిష్కరించారు. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు సద్గురు.
A poem is a piece of one’s Heart, hope your heart beats with these Eternal Echoes and know the rhythm of mine. – Sg #EternalEchoeshttps://t.co/cUeSgK17RN pic.twitter.com/32aazsm7dK
— Sadhguru (@SadhguruJV) August 23, 2024
‘ఒకరి మనసు లోతుల్లో నుంచి వచ్చిన మాటలు కవితకు రూపంలా మారుతాయి. ఈ ఎటర్నల్ ఎకోస్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. నా మనసు లోతులను మీకు తెలియజేస్తుంది’ అని సద్గురు ట్వీట్‌లో పేర్కొన్నారు. గ్రామీ అవార్డు విన్నర్ కోరీ హెన్రీ, గ్రామీ అవార్డు నామినీ జే డీల్, ఇషా ఫౌండేషన్ దేశీయ బ్యాండ్ – సౌండ్స్ ఆఫ్ ఇషా, కర్నాటిక్ శాస్త్రీయ గాయకుడు సందీప్ నారాయణ్, ఎఫర్ట్‌లెస్ ఆడియో కలిసి సంయుక్తంగా ఈ ఆల్బమ్ కోసం పని చేశాయి.
View this post on Instagram
16-ట్రాక్‌లతో కూడిన ఈ ఆల్బమ్ వరల్డ్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్, ఆల్టర్నేటివ్ జాజ్, యాంబియంట్ సౌండ్‌ల కలయికతో అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎదుర్కున్న అనేక మానవ అనుభవాలను.. జనాలందరూ ఈ ఆల్బమ్ ద్వారా మళ్లీ స్మృశించవచ్చు. ఈ ఆల్బమ్ ఇప్పుడు Spotify, Apple Music, Amazon Music, Jio Saavn, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆల్బమ్ వినడానికి, సందర్శించండి: https://monkmusic.link/eternalechoes
మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి 91 94874 75346కి కాల్ చేయండి
అభిప్రాయాలను mediarelations@ishafoundation.orgకు రాయండి..




