PF Employees: ఉద్యోగులకు షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం..
PF Employees: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పీఎఫ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉద్యోగులకు ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఈ పీఎఫ్ వడ్డీ..
PF Employees: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. పీఎఫ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయంతో ఉద్యోగులకు ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఈ పీఎఫ్ వడ్డీ రేట్లు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు చెందిన ఐదు కోట్ల మంది ఉద్యోగులపై ఈ ప్రమాదం చూపనుంది. రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి భవిష్య నిధి డిపాజిట్లపై 8.5 శాతం నుంచి 8.5 శాతం వడ్డీ రేట్లు చెల్లించాలని నిర్ణయించింది. ఈ పీఎఫ్ స్కీమ్‌లో ప్రతి సభ్యునికి 2021-22 సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ రేటును క్రెడిట్ చేయాలనే అంశంపై కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వశాఖ తన అంగీకారం కోసం ఆర్థిక మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలను పంపింది.
గత నాలుగు సంవత్సరాలలో పలుమార్లు ఈపీఎఫ్‌వోలో సభ్యుల డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గిస్తు్న్నారు. 2017-18లో 8.55 శాతంగా ఉన్న వడ్డీరేటు 2018-19లో 8.65 శాతానికి 2019-20లో 8.5 శాతానికి మారుస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. 2011-12లో ఈపీఎఫ్‌వోలో సభ్యుల డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీరేటు లభించింది.
కాగా, గత మార్చిలో 15.32 లక్షల మంది సభ్యులు చేరితే, ఫిబ్రవరిలో 12.85 లక్షల మంది జత చేశారు. ఫిబ్రవరితో పోలిస్తే 2.47 లక్షల మంది సభ్యులు మార్చిలో పెరిగారు. మొత్తం ఈపీఎఫ్‌వోలో ఐదు కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి