Ratan Tata: రతన్ టాటా మరణంతో సామాన్యుడు ఎందుకు కన్నీరు పెడుతున్నాడు?
అద్దాల మేడలో, ధగధగలాడే లైటింగ్స్ మధ్య.. ఉన్నోళ్లు మాత్రమే అలాంటి దుస్తులు వేసుకోగలరేమో అనుకునేలా ఉంటుందది. లోపలికి ఎంటర్ అయితే.. పేదవాళ్లు సైతం 150 రూపాయలు పెట్టి ఓ బ్రాండెడ్ టీ-షర్ట్ కొనుక్కోగలిగినంత రేట్లు ఉంటాయి. అదే జూడియో. ఇక జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్..

అద్దాల మేడలో, ధగధగలాడే లైటింగ్స్ మధ్య.. ఉన్నోళ్లు మాత్రమే అలాంటి దుస్తులు వేసుకోగలరేమో అనుకునేలా ఉంటుందది. లోపలికి ఎంటర్ అయితే.. పేదవాళ్లు సైతం 150 రూపాయలు పెట్టి ఓ బ్రాండెడ్ టీ-షర్ట్ కొనుక్కోగలిగినంత రేట్లు ఉంటాయి. అదే జూడియో. ఇక జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్. హై-నెట్‌వర్త్ ఉన్నోళ్లు మాత్రమే కొనగలిగే లగ్జరీ కార్లు అవి. అంటే.. పేదోళ్లకి, ఉన్నోళ్లకి మధ్య తేడా గమనించి దానికి తగ్గట్టుగా వ్యాపారం చేసే ఒకే ఒక్క బిజినెస్‌మాన్ రతన్ టాటా. వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో చేసినా సరే.. సామాన్యుడి సైతం దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసే ఒకే ఒక్కడు రతన్ టాటా. ‘ఇలాంటి వ్యక్తి ఇంతకుముందు లేరు, ఇకపై ఉండరు’.. రతన్ టాటా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతకు మించి చెప్పలేం. అయినా సరే.. ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ర ఆనందం అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కో డెఫినేషన్ ఇస్తారు. కాని, రతన్ టాటా ఇచ్చిన నిర్వచనం.. అనిర్వచనీయం. Indefinable అంతే. రతన్ టాటాను ఓ స్నేహితుడొచ్చి హెల్ప్ అడిగారు. ‘నాకు తెలిసిన దివ్యాంగులు ఉన్నారు, రఫ్‌గా ఓ 200 మంది ఉంటారు, వాళ్లకి వీల్ ఛైర్స్ కొనిస్తావా’ అని. అడక్కుండానే సాయం చేసే మేరునగధీరుడు మన రతన్ టాటా. అడిగితే కాదంటారా. వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూట్ చేసే రోజు టాటాను కూడా రమ్మన్నారు ఆ స్నేహితుడు. పంపిణీ అయిపోయింది. ఓ...
