Watch: ఓర్నీ ఎంతకు తెగించార్రా.. చూడటానికి స్నాక్స్ ప్యాకెట్సే.. కట్ చేస్తే, లోపల వేల కోట్ల గుట్టు.. వీడియో చూస్తే..

ఎక్కడ చూసినా డర్టీ.. డ్రగ్స్‌ కల్చర్‌.. కలకలం రేపుతోంది.. నగరాలను ఆ ఉక్కు పిడికిలి నుంచి విడిపించడం కోసం ఎంత ప్రయత్నించినా.. మాదకద్రవ్యం అనే ఆ మహమ్మారి మళ్లీమళ్లీ కోరలు చాస్తూనే ఉంది. నిందితులు ఏదో ఒక రూపంలో డ్రగ్స్ ను తరలిస్తూ పట్టుబడుతున్నారు.. ఘన, ద్రవ పద్దతుల్లో అయితే.. పట్టుబడుతున్నామని.. నిందితులు రూటు మార్చారు..

Watch: ఓర్నీ ఎంతకు తెగించార్రా.. చూడటానికి స్నాక్స్ ప్యాకెట్సే.. కట్ చేస్తే, లోపల వేల కోట్ల గుట్టు.. వీడియో చూస్తే..
Cocaine In Namkeen Packets
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 11, 2024 | 10:11 AM

ఎక్కడ చూసినా డర్టీ.. డ్రగ్స్‌ కల్చర్‌.. కలకలం రేపుతోంది.. నగరాలను ఆ ఉక్కు పిడికిలి నుంచి విడిపించడం కోసం ఎంత ప్రయత్నించినా.. మాదకద్రవ్యం అనే ఆ మహమ్మారి మళ్లీమళ్లీ కోరలు చాస్తూనే ఉంది. నిందితులు ఏదో ఒక రూపంలో డ్రగ్స్ ను తరలిస్తూ పట్టుబడుతున్నారు.. ఘన, ద్రవ పద్దతుల్లో అయితే.. పట్టుబడుతున్నామని.. నిందితులు రూటు మార్చారు.. ఇప్పుడు చాక్లెట్స్, స్నాక్స్ ప్యాకిట్లలో డ్రగ్స్ ను తరలిస్తున్నారు.. తాజాగా.. స్నాక్స్ ప్యాకిట్లలో డ్రగ్స్ తరలిస్తూ నిందితులు పట్టుబడటం కలకలం రేపింది.. ఇలా దేశ రాజధానిలో డ్రగ్స్ ప్రవాహానికి అడ్డుకట్టపడటం లేదు. ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. రమేష్ నగర్‌లో గురువారం 200 కిలోల కొకైన్‌ను స్పెషల్ సెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన కొకైన్ విలువ దాదాపు రూ.2000 కోట్లు ఉంటుందని వెల్లడించారు. జీపీఎస్ ద్వారా డ్రగ్స్ స్మగ్లర్స్‎ను కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్‌లో సోదాలు చేపట్టారు. పెద్ద ఎత్తున డంప్ చేసిన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నమ్‌కిన్ (స్నాక్స్) ప్యాకిట్లలో డ్రగ్స్ ను ప్యాక్ చేసి ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ పెడ్లర్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం బాక్సుల్లో వీటిని సరఫరా చేసేందుకు ఉంచినట్లు పేర్కొన్నారు. గోదాంలో నిల్వ ఉంచిన కొకైన్ స్వాధీనం చేసుకున్నామని.. తిను బండారాల ప్యాకెట్లలో ఈ డ్రగ్స్‌ను దాచినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన నిందితులు దేశం విడిచి పారిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా పట్టుబడ్డ డ్రగ్స్ తో కలిపి వారం వ్యవధిలోనే దేశ రాజధానిలో రూ.7,000 కోట్ల విలువైన కొకైన్‌ పట్టుబడింది. పట్టుబడిన కొకైన్‎కు ఇంతకు ముందు దొరికిన డ్రగ్స్‎కు లింక్ ఉందని అధికారులు వెల్లడించారు. వారం వ్యవధిలోనే రూ.7,500 కోట్ల విలువైన 762 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశామని.. దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్‌ రవాణా ఇదేనని అధికారులు చెబుతున్నారు.

వీడియో చూడండి..

ఈ భారీ కొకైన్‌ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రగ్ సిండికేట్ భారత్‎లోని ఢిల్లీ, ముంబైలలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. వీరికి దుబాయ్‌‎తో కూడా లింకులు ఉన్నాయని తెలిపారు. కొద్దిరోజుల క్రితం డ్రగ్స్ తో పాటు పలువురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..