AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dera baba: ఆ కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.. ఈనెల 12న శిక్ష ఖరారు

డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం హంతకుడే. ఓ కేసులో డేరాబాబాను దోషిగా తేల్చింది సీబీఐ కోర్టు. డేరాబాబాతో మరో నలుగురికి ఈ నెల 12న శిక్షలు ఖరారు చేయనుంది.

Dera baba: ఆ కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు.. ఈనెల 12న శిక్ష ఖరారు
Dera Baba
Ram Naramaneni
|

Updated on: Oct 08, 2021 | 3:44 PM

Share

లైంగిక వేధింపుల కేసులో శిక్ష అనుభవిస్తోన్న డేరా బాబాను తాజాగా ఓ హత్య కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. డేరా బాబా ఆశ్రమంలో మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ సహా జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్‌లు కుట్ర పన్నినట్టు కోర్టు  తేల్చింది. వీరికి అక్టోబరు 12న శిక్షలను ఖరారు చేయనుంది. డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10న హత్యకు గురయ్యారు. డేరాలోని మహిళలపై జరిగే ఆకృత్యాలను గుర్మీత్ రామ్ చేస్తున్న అరాచకాలను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడానికి అజ్ఞాత వ్యక్తి పేరుతో లేఖ రాసినట్టు రంజిత్ సింగ్‌ను అనుమానించాడని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సదరు లేఖను సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి బాగా సర్కులేట్ చేశారు. అనంతరం ఆయన కూడా హత్యకు గురయ్యారని సీబీఐ తెలిపింది.

హత్య గావించబడిన రంజిత్ సింగ్ హత్య కేసు దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో 2003 నవంబర్‌లో సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టు. అయితే, ఆ కేసును వేరే సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను రెండు రోజుల క్రితం న్యాయమూర్తులు కొట్టేశారు. బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చారు. తాజాగా పంచకులలోని సీబీఐ కోర్టు డేరా బాబాతో పాటు మరో నలుగురు అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. కాగా ఇప్పటికే ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబా 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2017లో అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. బుర్జ్ జవహర్ సింగ్ వాలా గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం దొంగతనం కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు.

Also Read: యాదగిరిగుట్టలో పిల్లి మిస్సింగ్‌ కేసు.. పిల్లలు అన్నం తినడం లేదని ఆవేదన

నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ